భయపెట్టడానికి సిద్దమైన మెగా హీరో.. సుకుమార్ గ్యాంగ్‌తో కలిసి థ్రిల్లర్ మూవీ!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి తన ట్రాక్ మారుస్తున్నాడు. మొన్నటివరకు రెగ్యులర్ కమర్షియల్ స్టోరీలనే ఎక్కువగా ట్రై చేసిన సాయి ఇప్పుడు థ్రిల్లర్ జనర్ ని టచ్ చేస్తున్నాడు. అది కూడా సుకుమార్ రైటింగ్స్ లో సిద్ధమవుతుండడంతో ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాల డోస్ పెరుగుతున్నాయి.
వరుస డిజాస్టర్స్ తరువాత చిత్ర లహరి, ప్రతి రోజు పండగే సినిమాలతో మంచి విజయాలను అందుకున్న సాయి ధరమ్ తేజ్ ఆ తరువాత సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ డిఫరెంట్ కథలతో రావాలని ప్లాన్ చేసుకుంటున్న సాయి ధరమ్ తేజ్ కి మంచి ఆఫర్ దక్కింది. సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తూ తన శిష్యుడైన కార్తిక్ వర్మకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తున్నాడు.

ఇక సుకుమార్ రైటింగ్స్ తో పాటు SVCC ప్రొడక్షన్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం కానుంది. ఈ సినిమా మిస్టికల్ థ్రిల్లర్ గా రూపొందనున్నట్లు తెలుస్తోంది. సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. చూస్తుంటే సాయి ధరమ్ తేజ్ ఎదో భయాన్ని కలిగించేలా ఉన్నాడని అనిపిస్తోంది. ఇక సుకుమార్ ఇప్పటికే తన దగ్గర ఉన్న సహాయక దర్శకులతో మంచి మంచి సినిమాలను నిర్మించాడు. వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాను కూడా సుకుమార్ శిష్యుడే డైరెక్ట్ చేశాడు. అలాగే నిఖిల్, నాగ శౌర్య వంటి యువ హీరోలతో నిర్మిస్తున్న కొత్త సినిమాలకు కూడా తన స్టూడెంట్స్ తోనే డైరెక్షన్ చేయిస్తున్నాడు సుకుమార్. మరి ఆ యువ దర్శకులు సుకుమార్ నమ్మకాన్ని ఎంతవరకు సక్సెస్ చేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











