పెద్ద మావయ్య, చిన్న మావయ్య సినిమాల్లో అవే ఇష్టం: సాయి ధరమ్ తేజ్

గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌కి ఈ ఏడాది (2019) బాగానే కలిసొచ్చింది. ఏప్రిల్ నెలలో చిత్రలహరి సినిమాతో మీడియం రేంజ్ హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్.. ఇటీవలే విడుదలైన 'ప్రతిరోజూ పండగే' సినిమాతో సక్సెస్ టాక్ తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పెద్ద మావయ్య, చిన్న మావయ్య సినిమాల్లో ఇష్టమైన సినిమాల గురించి మాట్లాడారు.

పెద్ద మావయ్య చిరంజీవి చేసిన సినిమాల్లో 'చంటబ్బాయ్' అంటే తనకు చాలా ఇష్టం అని అన్నాడు సాయి ధరమ్ తేజ్. 'చంటబ్బాయ్' సినిమాకి సీక్వెల్ అని కాదు గానీ, ఆ జోనర్లో చేయాలనుందని ఆయన పేర్కొన్నాడు. అదే విధంగా చిన్న మావయ్య పవన్ కల్యాణ్ చేసిన సినిమాల్లో 'ఖుషీ', 'తొలిప్రేమ' అంటే చాలా ఇష్టమని చెప్పాడు. ఆ తరహా కథలను చేయాలనుందని ఈ సందర్బంగా సాయి ధరమ్ తేజ్ తెలిపాడు.

Sai Dharam Tej Reaction On Chiranjeevi, Pawan Kalyan Movies

ఇక 'ఇంతకీ పెళ్లి' ఎప్పుడు? అని అలీ సరదాగా అడిగిన ప్రశ్నకి సాయిధరమ్ తేజ్ బదులిస్తూ తెగ సిగ్గుపడిపోయాడు. 'నేను పెళ్లి చేసుకోను' అని సమాధానం ఇచ్చాడు. దీంతో 'ఇప్పుడు పెళ్లి చేసుకోవా? లేదంటే అసలే చేసుకోవా?' అని అలీ అనేయడంతో స్పష్టత ఇవ్వకుండా నవ్వుతూ దాటేశాడు సాయి ధరమ్ తేజ్.

మరుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'ప్రతిరోజూ పండగే' సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతూ లాభాల దిశగా పరుగులు పెడుతోంది. దేశంలోనే గాక యూఎస్ మార్కెట్‌లో కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X