సైరా టీజర్‌పై మెగా మేనల్లుడి రియాక్షన్.. చిరు ఫ్యాన్స్ ఖుషీ

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ల జోరు పెంచింది. చిరంజీవి పుట్టిన రోజు కానుకగా తాజాగా 'సైరా నరసింహా రెడ్డి' టీజర్ విడుదల చేశారు.

ఈ చిత్రం ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వనుందని టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్‌తో టీజర్ విడుదల కావడంతో మెగా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా సైరా టీజర్ చూసిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ''చరిత్ర మిమల్ని ఎప్పటికీ మరిచిపోలేదు'' అంటూ వివిధ భాషల్లో టీజర్ తాలూకు లింక్స్ పోస్ట్ చేశాడు. అంతేకాదండోయ్.. చిరు బర్త్ డే కామన్ డీపీ తన ట్విట్టర్ పేజీ డీపీగా పెట్టుకున్నాడు. మెగాస్టార్ కుటుంబమంతా చిరంజీవి సైరా పట్ల ఇంత పాజిటివ్‌గా ఉండటం మెగా అభిమానులను ఖుషీ చేస్తోంది.

Sai Dharam Tej reaction on Sy Raa Narasimhaa Reddy teaser

సైరా నరసింహా రెడ్డి మూవీని 1857 బ్రిటిష్ కాలం నేపథ్యంలో తెరకెక్కడంతో అప్పటి పరిస్థితులకు అద్దంపట్టేలా భారీ సెట్స్ వేసి రూపొందించారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.

ఇక ఈ చిత్రంలో చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, నయనతార, తమన్నా కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న 'సైరా నరసింహా రెడ్డి' మూవీ అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X