twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Republic Twitter Review: ఏపీ రాజకీయాలపై ఘాటైన విమర్శనాస్త్రం.. ఇరగదీసిన సాయిధరమ్ తేజ్

    |

    మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సెకండ్ అనంతరం మళ్లీ అదే తరహాలో పాజిటివ్ వైబ్రేషన్స్ తో ఒక విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తెరకెక్కించే దేవకట్టా డైరెక్ట్ చేసిన రిపబ్లిక్ మూవీ పై ఓ వర్గం ప్రేక్షకుల్లో అయితే అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా కొన్ని గంటలకు ముందే ఓవర్సీస్ లో కూడా ప్రదర్శించారు. సినిమాలు చూసిన ప్రేక్షకులు వారి అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఇక మరికొందరు ట్విట్టర్లో కూడా సినిమాకు ప్రత్యేకంగా రివ్యూలు కూడా ఇస్తున్నారు. మొత్తంగా సినిమా ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే..

     పవన్ కళ్యాణ్ స్పీచ్ తరువాత..

    పవన్ కళ్యాణ్ స్పీచ్ తరువాత..

    హీరో సాయి ధరమ్ తేజ్ చివరగా సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ సినిమా కంటే భిన్నంగా పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన రిపబ్లిక్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ సినిమాకు మొదట్లో పెద్దగా అంచనాలు అయితే లేవు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రిలీజ్ ఈవెంట్ లో స్పీచ్ ఇచ్చారో అప్పటి నుంచి కూడా ఇండస్ట్రీలో ఈ మూవీపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ సినిమా మెగా అభిమానులు కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు అని సోషల్ మీడియాలో హడావిడి చూస్తే అర్థమవుతుంది. అంతే కాకుండా ఈ సినిమా పవన్ కళ్యాణ్ ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

     బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే..

    బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే..

    ఇక ఈ సినిమా తెలంగాణ ఏపీలో భారీ స్థాయిలో విడుదల అవుతోంది. లవ్ స్టోరీ సినిమా తర్వాత అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 700కు పైగా థియేటర్లలో విడుదల అవుతోంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ టార్గెట్ తో రంగంలోకి దిగుతుంది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 13 కోట్ల వరకు దాటినట్లు సమాచారం బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవాలి అంటే 14 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది.

    హరీష్ శంకర్ రివ్యూ

    హరీష్ శంకర్ రివ్యూ

    ఇప్పటికే ఈ సినిమా ఇండస్ట్రీలో కొంత మంది చూశారు. నాని మొదటి రివ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. దేవాకట్టా దర్శకత్వం సాయి నటన సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ అంటూ ఎంతో పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. అలాగే సాయి ధరమ్ తేజ్ కు అత్యంత సన్నిహితులైన. హరీష్ శంకర్ కూడా తన రివ్యూ ఇచ్చేశాడు. సాయిధరమ్ తేజ్ కెరీర్లోనే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు అంటూ ఇది ఒక హానెస్ట్ స్టోరీ అని దర్శకుడు పై కూడా పాజిటివ్ కామెంట్ చేశారు. ఇక జగపతి బాబు రమ్యకృష్ణ ఐశ్వర్య రాజేష్ పాత్రలు కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని తెలియజేశారు.

    మారుతి కామెంట్స్

    మారుతి కామెంట్స్

    మరో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మారుతీ కూడా సినిమా ప్రీమియర్ షోను చూసి ఈ విధంగా తన వివరణ ఇచ్చారు. తమ్ముడు సాయి ధరమ్ తేజ్ పర్ఫామెన్స్ దర్శకుడు దేవకట్టా తన నిజాయితీతో అద్భుతమైన కథను ఎంచుకున్నాడు. జగపతిబాబు ఐశ్వర్య రాజేష్ రమ్యకృష్ణ పాత్రలు కూడా అద్భుతంగా ఉన్నాయని అలాగే మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని వివరణ ఇచ్చారు.

    ఏపీ రాజకీయాలు..

    ఏపీ రాజకీయాలు..

    ఇక ఈ సినిమాలో ఏపీ రాజకీయాలకు సంబంధించిన కొన్ని నిజమైన సంఘటనలు కూడా చూపించినట్లు తెలుస్తోంది. రిపబ్లిక్ ఫస్ట్ సీన్ నుండి డైరెక్ట్ గా ఏపీ రాజకీయాల్లోనే ఒక పార్టీకి సంబంధించిన వివాదాస్పదమైన సంఘటనలను హైలెట్ చేశారని టాక్ అయితే వస్తోంది. డైరెక్ట్ గా రిఫరెన్స్ లు పెట్టేశారు అంటూ కొంతమంది నెటిజన్లు వారి వివరణ ఇస్తున్నారు.దీంతో సినిమా పై మరికొంత అంచనాలు కూడా పెరుగుతున్నాయి.

    సాయి ధరమ్ తేజ్ నటన హైలెట్

    సాయి ధరమ్ తేజ్ నటన హైలెట్

    సాయి ధరమ్ తేజ్ నటనపైన ఎక్కువమంది పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు. అతని కెరీర్లోనే ఇది ఒక మంచి పాత్ర అంటూ దేవకట్ట తనదైన శైలిలో సాయి ధరంతేజ్ ను అద్భుతంగా హైలెట్ చేశారని అన్నారు. ఫస్టాఫ్ చాలా డీసెంట్ గా ఉందని సాయి తన నటనతో ఆకట్టుకున్నాడు అని పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.

    నెగిటివ్ కామెంట్స్ కూడా

    నెగిటివ్ కామెంట్స్ కూడా

    ఎన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తున్నప్పటికీ కూడా మరొకవైపు కొన్ని నెగటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఓవరాల్ గా సినిమా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేక పోయిందని డిసప్పాయింట్ చేసిందని పొలిటికల్ థ్రిల్లర్ అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. మూవీ లో కొన్ని మంచి అంశాలు ఉన్నాయని ముఖ్యంగా డైలాగ్స్ చాలా బాగున్నాయి అని అంటున్నారు. అయితే అందుకు తగ్గట్టుగా డైరెక్షన్ ప్రతిభ కనిపించలేదని నిర్మాణ విలువలు అలాగే సినిమా ఎడిటింగ్ కూడా అంతగా నచ్చకపోవచ్చు అని మరికొందరు అంటున్నారు

    Recommended Video

    Aishwarya Rajesh And Deva Katta Speaks About Republic Movie
    హిట్ ప్లాప్ అని అనకుండా..

    హిట్ ప్లాప్ అని అనకుండా..

    రిపబ్లిక్ మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా ఈ సినిమా ఒక సామాజిక అవగాహన కోసం తప్పకుండా చూడాలి అని మరికొందరు అంటున్నారు. రెగ్యులర్ డార్క్ పాలిటిక్స్ సిస్టమ్ నుంచి బయటకు వచ్చి సినిమాను చూస్తే ఒక మంచి సినిమాలు చూసాము అనే అనుభూతి కలుగుతుందని దేవ కట్టా పరిజ్ఞానంతో ఈ సినిమా చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేశాడని ముఖ్యంగా రిపబ్లిక్ అనే పదానికి సరైన న్యాయం కూడా చేశారని మరికొందరు అంటున్నారు.

    English summary
    Sai dharam tej Republic Twitter Review,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X