BRO: పవన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. బయటపడిన అసలు నిజం.. ఏంటీ 'బ్రో' ఇది!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు ఉన్న పాపులారీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో సైతం భారీగా అభిమానగనం ఉంది. ఓవైపు రాజకీయాల్లో, మరోవైపు సినిమాల్లో ఫుల్ జోష్ చూపిస్తున్నారు. ఇక ఆయన సినిమా కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. మూవీ వస్తే పండుగలా ట్రీట్ చేస్తారు. అలాంటి పవన్ కల్యాణ్ కోసం తాజాగా హీరో సాయి ధరమ్ తేజ్ బ్యాడ్ న్యూస్ చెప్పాడు. బ్రో బ్రో మూవీ (Bro Movie)కి సంబంధించి మాట్లాడిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
భారీ ఆశలు:అనేక అంచనాలు, భారీ ఆశలతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మామా అల్లుళ్లు పవర్ స్టార్ పవన్ కల్యాణ్- సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మల్టీ స్టారర్ మూవీ బ్రో. ఈ సినిమాకు సముద్ర ఖని దర్శకత్వం వహించగా.. స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే బాధ్యతలు చేపట్టారు. ఇక సంగీతాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించారు.

జూలై 28న:బ్రో సినిమాలో ముద్దుగుమ్మలు కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే బ్రహ్మానందం, సీనియర్ నటి రోహిణి ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రో సినిమాను జూలై 28న అంటే రేపే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది.

భారీ రెస్పాన్స్:ఇక బ్రో సినిమా నుంచి విడుదలైన టీజర్, గ్లింప్స్, పోస్టర్స్, పాటలైన మై డియర్ మార్కండేయా, జాణవులే వంటి పాటలు మంచి హిట్స్ సాధించాయి. ఇక ట్రైలర్ కు భారీగా రెస్పాన్స్ వచ్చిందగి. ఈ ట్రైలర్ చివర్లో గుడుంబా శంకర్ మూవీలోని 'కిల్లీ కిల్లీ' అనే పాటను రీమేక్ చేసి కొద్దిగా వదిలారు.

ప్రమోషనల్ మాత్రమే:అంతేకాకుండా జూలై 25న జరిగిన బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఈ రీమేక్ పాటను వీడియోతో ప్లే చేశారు. అందులో పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ తోపాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా స్టెప్పులేశారు. ఈ పాటకు అభిమానులు ఈలలతో గోల చేశారు. ఇక ఈ సాంగ్ సినిమాలో కూడా ఉంటే థియేటర్లలో రచ్చ రచ్చగా ఉండేది. కానీ, ఈ పాట కేవలం ప్రమోషనల్ సాంగ్ మాత్రమే అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ చెప్పి షాక్ ఇచ్చాడు.
42 సెకన్ల పాటు:42 సెకన్లపాటు ఉన్న ఈ పాట సినిమాలో ఉంటే ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయేవారు. కానీ సాయి ధరమ్ తేజ్ మాటలతో ఈ సాంగ్ బిగ్ స్క్రీన్ పై కనిపించడం కష్టమే అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బ్రో సినిమా 99 నిమిషాల నిడివితో ఉన్న వినోదయ సీతం అనే తమిళ సినిమాకు రీమేక్ అని టాక్ వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ తెలుగులో కూడా జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే బ్రో మూవీకి మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ అంతా మార్చేశారు అని డైరెక్టర్ సముద్ర ఖని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.


Click it and Unblock the Notifications











