సాయి ధరమ్ తేజ్ సినిమాకు బడ్జెట్ కోత!
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ నిర్మిస్తోన్న చిత్రం చిత్రలహరి. సాయిధరమ్ తేజ్ సరసన కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని మొదట రూ. 20 కోట్లలో ప్లాన్ చేశారట. అయితే సాయి ధరమ్ తేజ్ వరుస ప్లాపులను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కుదించారని, రూ. 14 కోట్లలో కంప్లీట్ చేసినట్లు సమాచారం. 2015లో వచ్చిన సుప్రీమ్ తర్వాత తేజ్ నటించిన తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్ యు .. ఇలా వరుస ప్లాపులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

ఎమోషనల్ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా 'చిత్రలహరి' తెరకెక్కుతోంది. టైటిల్‌లో ఐదు అక్షరాలు ఉన్నట్లు సినిమాలో ఐదు క్యారెక్టర్స్‌కు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుందట. సినిమా ఈ ఐదు పాత్రల చుట్టూ ఎక్కువగా తిరుగుతుందని, సాయిధరమ్ తేజ్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుందని దర్శకుడు కిషోర్ తిరుమల చెబుతున్నారు.
ఏప్రిల్ 12న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ చిత్రంలో సాయిధరమ్‌తేజ్ సరసన కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాశ్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని.


Click it and Unblock the Notifications











