For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కంటతడి పెట్టించిన సాయిధరమ్ తేజ్.. యాక్సిడెంట్ తర్వాత రంగ రంగ వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తొలి స్పీచ్ ఇలా..

  |

  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో బాపినీడు బీ సమర్పించిన చిత్రం రంగ రంగ వైభవంగా. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు గిరీషయా. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, శ్యామ్ దత్ సునీద్దీన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 2వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. యాక్సిడెంట్ తర్వాత తొలిసారి ఈ వేడుకలో సాయిధరమ్ తేజ్ ముఖ్య అతిథిగా కనిపించారు. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ ఎమోషనల్‌గా మాట్లాడుతూ..

  ఇలా స్టేజ్ మీద నిలబడి మాట్లాడటం

  ఇలా స్టేజ్ మీద నిలబడి మాట్లాడటం


  అందరికీ నమస్కారం. ఇలా మీ అందరిని కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇలా స్టేజ్ మీద నిలబడి మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. నా స్పీచ్‌కు ముందు సుమ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు సుమ గారు నా ఫ్యామిలికి చాలా సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్యూ సో మచ్. ఆల్ యువర ప్రేయర్స్ ఇలా నేను మీ ముందు వచ్చాను అని సాయిధరమ్ తేజ్ అన్నారు.

  కేతికా అద్భుతంగా ఉంది..

  కేతికా అద్భుతంగా ఉంది..


  దర్శకుడు గిరీష్‌కు ధన్యవాదాలు. మంచి మ్యూజిక్ ఇచ్చి దేవీ శ్రీ ప్రసాద్‌ అదరగొట్టాడు. ఈ సినిమాకు శ్యామ్ దత్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆయనకు నేను ట్రబుల్ ఇచ్చాను. అందుకు సారీ. నిర్మాత ప్రసాద్‌ గారు నాకు మంచి సక్సెస్‌ఫుల్‌ మూవీ ఇచ్చారు. నాకు చాలా ఇష్టమైన ప్రొడ్యూసర్. అలాగే నాకు ఫ్యామిలీ మాదిరిగా సపోర్ట్ చేస్తారు. చిత్ర యూనిట్‌కు కంగ్రాట్స్. ఈ సినిమాలో కేతికా అద్భుతంగా కనిపించింది. కేతికా శర్మకు ఆల్ ది బెస్ట్. అని సాయిధరమ్ తేజ్ అన్నారు.

  విధిరాత ప్రకారం యాక్సిడెంట్

  విధిరాత ప్రకారం యాక్సిడెంట్


  2021 సంవత్సరం మాకు చాలా హ్యాపీ ఇయర్. ఉప్పెన సక్సెస్‌ చేయడమే కాదు.. బ్లాక్ బస్టర్ ఇచ్చారు. వైష్ణవ్ తేజ్‌ను హీరోగా యాక్సెప్ట్ చేశారు అలాంటి సమయంలో రంగ రంగ వైభవంగా షూటింగ్ జరిగే సమయంలో నాకు యాక్సిడెంట్ జరిగింది. నా సినిమా రిలీజ్ అవుతుందని అనుకొంటున్న సమయంలో నా విధిరాత ప్రకారం యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత అసలు ఏం జరిగిందో నాకు ఏమీ తెలియని పరిస్థితుల్లో ఉన్నాను అని సాయిధరమ్ తేజ్ చెప్పారు.

  నా తమ్ముడు వచ్చి పిలిస్తే..

  నా తమ్ముడు వచ్చి పిలిస్తే..


  యాక్సిడెంట్ తర్వాత హాస్పిటల్‌ బెడ్ మీద పడుకొంటే.. నా తమ్ముడు వచ్చి పిలిస్తే నేను పలకలేదు అంటూ కొద్ది సేపు ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు వస్తుంటే.. ఆపుకొంటుండగా.. వైష్ణవ్ పరుగున వచ్చి ఓదార్చాడు. ఆ తర్వాత మాట్లాడుతూ.. అన్నా అని పిలిచాడు. కానీ నేను పలకలేదు. మనం బతికి ఉన్నప్పుడు అమ్మ, నాన్న, తమ్ముడు కలిసి ఉంటే బాగుండేదని అర్ధమైంది. వీడు నా పక్కన ఉన్నప్పుడు నాకు ధైర్యం, నా బలం. నా తమ్ముడిని హీరోగా యాక్సెప్ట్ చేశారు. అదే నాకు కొండంత ఆనందం అని సాయిధరమ్ తేజ్ ఎమోషనల్ అయ్యారు.

  వైష్ణవ్‌ను ఆటపట్టించిన సాయిధరమ్ తేజ్

  వైష్ణవ్‌ను ఆటపట్టించిన సాయిధరమ్ తేజ్


  ఇక వైష్ణవ్ తేజ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతీ సినిమాలో రొమాంటిక్ సాంగ్స్ చేస్తున్నావు. నీవు కింగ్ ఆఫ్ రొమాన్సా అని సరదాగా ఆటపట్టించారు. స్టేజ్ పైన ఉన్నా.. కింద ఉన్నా వైష్ణవ్‌ను ఆటపట్టించడం నాకు చాలా సరదా. మనం ఇష్టపడే వారు నవ్వితే.. అదే నాకు హ్యాపీ. మీ అందరి ముఖాల్లో నవ్వు కనిపిస్తుంది. అదే నాకు చాలా హ్యాపీ. నేను 90 వేయలేదు. నాకు తాగడం అలవాటు లేదు. నిజాయితీగా చెబుతున్నాను. నా తమ్ముడు మంచి యాక్టర్. కాబట్టి థియేటర్‌కు వెళ్లి సినిమా చూడండి అని సాయిధరమ్ తేజ్ అన్నారు.

  English summary
  Actor Vaisshnav Tej's Ranga Ranga Vaibhavanga is coming to theatres on September 2nd. Sai Dharam Tej emotional speech at Ranga Ranga Vaibhavanga pre release event
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X