అమెరికా పయనమైన మెగా మేనల్లుడు.. ఇక ప్రతీ రోజు పండగే!

సాయి ధరమ్ తేజ్ హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్‌పై తెరకెక్కుతోంది 'ప్రతీ రోజు పండుగే' మూవీ. మారుతి దర్శకత్వం వహిస్తుండగా.. బన్నీవాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ బాణీలు కడుతున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉండగానే సాయి ధరమ్ తేజ్ మామ మెగాస్టార్ చిరంజీవి కూడా పరిశీలించి ఓకే చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న 'ప్రతీ రోజు పండుగే' సినిమా యూనిట్ ఇక అమెరికా బయల్దేరనుంది. అక్కడి అందమైన లొకేషన్స్‌లో చిత్రంలోని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారట. తాతామనవళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. కుటుంబ బంధాలు, విలువలు, భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయిధరమ్‌కు తాతగా సత్యరాజ్ నటిస్తున్నారు.

Sai Dharam Tejs Prathi Roju Pangade movie update

ఇన్ని రోజులు పల్లె వాతావరణం ప్రతిబింబించేలా పలు సెట్స్ వేసి షూటింగ్ వేసిన చిత్రయూనిట్.. ఇక అమెరికా అందాలను కెమెరాలో బంధించడానికి రెడీ అయింది. ఈ రోజు (మంగళవారం) సాయి ధరమ్ తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌ గ్లిమ్స్‌ విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ చిత్రంలో సాయిధరమ్‌ తేజ్‌ లుక్‌ కొత్తగా ఉంటుందని, మారుతి తరహా ఎంటర్‌టైన్‌మెంట్‌ రెండింతలు ఎక్కువగా ఈ చిత్రంలో ఉంటుందని అంటున్నారు యూనిట్ సభ్యులు. అతిత్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X