ఏ సందర్భంలోనైనా నాకు అండగా ఉన్నది వాళ్ళే.. మెగా మేనల్లుడి కామెంట్స్

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటిస్తోన్న చిత్రం 'ప్రతిరోజూ పండగే'. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సత్యరాజ్, రావు రమేష్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. థమన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇందులో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు అల్లు అరవింద్, దిల్ రాజు తదితరులు సందడి చేశారు.

 సందడే సందడి అన్నట్లుగా..

సందడే సందడి అన్నట్లుగా..

ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా సందడి సందడిగా జరిగింది. రాశిఖన్నా, సాయి ధరమ్ తేజ్ ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. యూనిట్ అంతా కలిసి స్టేజీపై వేసిన డాన్స్ ఈవెంట్‌లో హైలైట్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మొత్తానికి ఈవెంట్ చూస్తూ అంతా ఎంజాయ్ చేశారు.

నాకు అండగా ఉన్నది వాళ్ళే: సాయి ధరమ్ తేజ్

నాకు అండగా ఉన్నది వాళ్ళే: సాయి ధరమ్ తేజ్

ఇక ఈవెంట్‌లో వేదికపై మాట్లాడిన సాయి ధరమ్ తేజ్ మెగా ఫ్యాన్స్‌ని తెగ పొగిడారు. ''మా ఫంక్షన్‌కు వచ్చిన అందరికీ థాంక్స్. ఫ్యాన్స్ ఉంటే మాకు ప్రతిరోజు పండగే. నాకు ఎప్పుడూ అండగా నిలబడింది మెగా ఫ్యాన్స్. వారందరు గర్వపడేలా నేను ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపిస్తాను. మెగాస్టార్ చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ తో పాటు అభిమానుల బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నా'' అన్నాడు.

 షూటింగ్ సమయంలో బాగా ఎంజాయ్ చేసాం..

షూటింగ్ సమయంలో బాగా ఎంజాయ్ చేసాం..

థమన్ నాకోసం మంచి సాంగ్స్ ఇచ్చాడని సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నాడు. సినిమా చూశాక ఆడియన్స్ నిరుత్సాహ పడరనే నమ్మకం ఉందని ఈ సందర్బంగా ఆయన చెప్పాడు. ఐదేళ్ల క్రింద 'పిల్లా నువ్వులేని జీవితం' విడుదలయ్యింది, మళ్ళీ ఇప్పుడు అరవింద్ గారితో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉందని మెగా మేనల్లుడు అన్నాడు. సినిమా షూటింగ్ సమయంలో బాగా ఎంజాయ్ చేశామని ఆయన తెలిపాడు.

 చివరకు ఆ కోరిక తీరింది: రాశిఖన్నా

చివరకు ఆ కోరిక తీరింది: రాశిఖన్నా

''అభిమానులకు, ఆడియన్స్ అందరికీ నమస్కారం. మారుతి గారు మంచి కథ రాయడంతో పాటు బాగా తీశారు. నాపై నమ్మకం పెట్టి నాకు ఈ రోల్ ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. నన్ను ఎప్పటినుండో సపోర్ట్ చేస్తున్న అరవింద్ గారికి ధన్యవాదాలు. గీతా ఆర్ట్స్‌లో చేయాలన్న కోరిక ఈ సినిమాతో తీరింది. తేజ్ ఈ సినిమా కోసం కష్టపడి వర్క్ చేశాడు'' అని చెప్పింది.

ప్రతిరోజూ పండగే అవుతుంది

ప్రతిరోజూ పండగే అవుతుంది

ఇప్పటి వరకు ప్రతిరోజూ పండగే సినిమా నుంచి రిలీజైన అన్ని అప్‌డేట్స్‌కి వచ్చిన ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉందని సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నాడు. డిసెంబర్ 20వ తేదీన 'ప్రతిరోజూ పండగే' సినిమా విడుదల కానుంది. ఆ రోజు నుంచి అన్ని వర్గాల ప్రేక్షకులకు ప్రతిరోజూ పండగే అవుతుందని అంటున్నారు మేకర్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X