Prati Roju Pandage: రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే..
అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్‌పై రూపొందిన సినిమా 'ప్రతిరోజూ పండగే'. సాయి ధరమ్ తేజ్, రాశిఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు (డిసెంబర్ 20) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే విదేశాల్లో, దేశంలో పలు చోట్ల ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ మేరకు సినిమా చూసిన జనం ట్విట్టర్ వేదికగా తమ స్పందన తెలిపారు. ఆ వివరాలు చూద్దామా..
ఫస్టాఫ్.. సెకండాఫ్
ప్రతిరోజూ పండగే ఎంటర్‌టైనింగ్ ఫస్టాఫ్, సెంటిమెంటల్ సెకండాఫ్. ఫ్యామిలీ ఆడియన్స్ రెస్పాన్స్ బట్టి సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది.
థమన్ మ్యూజిక్.. మారుతీ డైరెక్షన్
ప్రతిరోజూ పండగే సాయి ధరమ్ తేజ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. రాశిఖన్నా బాగా చేసింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాతో మారుతీ మనముందుకొచ్చాడు. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్.
సెకండాఫ్ కామెడీ
ప్రతిరోజూ పండగే ఫస్టాఫ్ బాగుంది. కొంత కామెడీ తప్పితే సెకండాఫ్ సోది.
కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్
ప్రతిరోజూ పండగే.. రొటీన్ బట్ గుడ్ ఫస్టాఫ్. కొన్ని కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగా పండాయి. ఏంజిల్ ఆర్నా క్యారెక్టర్ బాగుంది. సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి.
రొటీన్ స్టోరీ..
ప్రతిరోజూ పండగే రొటీన్ స్టోరీ. అవేరేజ్ ఫస్టాఫ్. బిలో ఆవేరేజ్ సెకండాఫ్. మూవీని బాలయ్యే కాపాడాలి.

మొత్తంగా చూస్తే..
మొత్తంగా చూస్తే ప్రస్తుతానికి ప్రతిరోజూ పండగే సినిమాకు యావరేజ్ టాక్ వినిపిస్తోంది. కథలో కొత్తదనం లేదని, రొటీన్ స్టోరీ అని అంటున్నారు. ఫస్టాఫ్‌లో కొన్ని కామెడీ, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నాయి కానీ, సెకండాఫ్ డల్‌గా ఉందని ఇప్పటిదాకా అందిన రిపోర్ట్స్ చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











