అక్కడెక్కడో జరిగితే బాధపడ్డాం.. కానీ మనం చేస్తున్నదేంటి? మెగా మేనల్లుడి రియాక్షన్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అతిపెద్ద అటవీ ప్రాంతమైన నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొందరు సినీ ప్రముఖులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. దీంతో ఇది కాస్త రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
యురేనియం తవ్వకాలపై అభ్యంతరం తెలుపుతూ ఇప్పటికే విజయ్ దేవరకొండ, అనసూయ లాంటి సినీ తారలు స్పందించగా, తాజాగా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇదే విషయంపై ట్వీట్ పెట్టారు. ''ఎక్కడో ఉన్న అమెజాన్ అడవులు కాలిపోతుంటే మనం బాధపడ్డాం. కానీ మనం చేస్తున్నదేంటి? రండి.. మన ప్రకృతిని కాపాడుకుందాం. సేవ్ నల్లమల'' అని సాయిధరమ్ తేజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక సాయిధరమ్ తేజ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'ప్రతిరోజూ పండుగే' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ జోడీగా రాశీఖన్నా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్‌పై ఈ సినిమాను బన్నీవాస్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.


Click it and Unblock the Notifications











