‘పంజా అభిరామ్’గా సాయి ధరమ్ తేజ్: ఒకే ఒక్క పోస్టర్‌తో మొత్తం రివీల్ చేసేశారు

మెగా కాంపౌండ్‌ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా పరిచయం అయిన అతడు.. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను అందుకున్నాడు. అయితే, ఆ తర్వాత చాలా కాలం పాటు వరుస పరాజయాలను చవి చూశాడు. దీంతో అతడి కెరీర్ ప్రశ్నర్థకం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో 'చిత్రలహరి' అనే మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు సాయి ధరమ్ తేజ్. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతున్నాడు.

ఈ మధ్య కాలంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. 'చిత్రలహరి' తర్వాత వరుసగా 'ప్రతిరోజూ పండగే' వంటి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇది అతడి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ ఉత్సాహంతో అతడు మరిన్ని చిత్రాలను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది లాక్‌డౌన్ తర్వాత 'సోలో బ్రతుకే సో బెటర్' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా హిట్ అయింది. తద్వారా అతడి ఖాతాలో హ్యాట్రిక్ హిట్లు వచ్చి చేరాయి. ఈ జోష్‌లోనే ఇప్పుడు 'రిపబ్లిక్' అనే సినిమాను చేశాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.

 Sai Dharam Tejs Republic Movie Release on October 1st

విలక్షణ చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు దేవ కట్టా. అతడి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రమే 'రిపబ్లిక్'. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న ఈ సినిమాను జూన్ 4న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్యం కాలేదు. దీంతో దీన్ని ఓటీటీలో నేరుగా రిలీజ్ చేస్తారన్న టాక్ వినిపించింది. కానీ, అది కూడా అవాస్తవమే అని తేలింది. ఇక, ఇప్పుడు ఈ సినిమాను ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారన్న దానిపై చిత్ర యూనిట్ ప్రకటన చేసింది.

పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందిన 'రిపబ్లిక్' మూవీని అక్టోబర్ 1న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఇందులో 'పంజా అభిరామ్.. జిల్లా కలెక్టర్' అనే నేమ్ బోర్డ్ కనిపిస్తోంది. తద్వారా ఇందులో సాయి ధరమ్ తేజ్ కలెక్టర్‌గా నటిస్తున్నట్లు పరోక్షంగా వెల్లడించారు. వాస్తవానికి గతంలోనే అతడి పాత్రకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు అతడి రోల్‌ను వాళ్లే రివీల్ చేసేశారు. దీంతో సినిమా నేపథ్యంపై కూడా క్లారిటీ వచ్చేసినట్లైంది.

కొల్లేరు సరస్సు సమస్యల నేపథ్యంలో రూపొందిన 'రిపబ్లిక్' మూవీలో సాయి ధరమ్ తేజ్ ప్రభుత్వ ఉద్యోగిగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన ఉద్యోగాన్ని వదిలేసి హీరో ప్రజల కోసం పోరాటం చేయడం అనే కాస్సెప్టుతో ఇది రూపొందిందట. ఇక, ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ముఖ్యమంత్రి పాత్రను చేస్తున్నారు. అలాగే, ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X