Republic Trailer: దేనికి భయం అంటూ గర్జించిన సుప్రీమ్ హీరో.. పవన్‌ను గుర్తు చేసేలా డైలాగ్

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా హీరోగా పరిచయం అయినా.. చాలా తక్కువ సయమంలోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా పలు విభాగాల్లో అదగొడుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే పలు విజయాలను కూడా అందుకున్నాడు. అయితే, కొంత కాలం పాటు సాయి తేజ్ వరుస పరాజయాలతో సతమతం అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'చిత్రలహరి' అనే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడని ఈ మెగా హీరో.. 'ప్రతిరోజూ పండగే', 'సోలో బ్రతుకే సో బెటర్' వంటి హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ జోష్‌లో ఉన్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం విలక్షణ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దర్శకుడు దేవ కట్టాతో 'రిపబ్లిక్' అనే సినిమాను చేస్తున్నాడు. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎప్పుడో పూర్తైంది. కానీ, అనివార్య కారణాల వల్ల దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఈ సినిమాను అక్టోబర్ 1న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అందుకు అనుగుణంగానే తగిన ఏర్పాట్లను కూడా చేస్తున్నారు.

 Sai Dharam Tejs Republic Movie Trailer Released

'రిపబ్లిక్' మూవీ విడుదలకు సమయం దగ్గరపడడంతో చిత్ర యూనిట్ ప్రచారాన్ని ముమ్మరం చేసేసింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఓ జిల్లాకు కలెక్టర్ అయిన హీరో.. ప్రజల సమస్యల కోసం ప్రభుత్వాన్ని ఎలా ఎదురించాడు? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? అనే విషయాలను సవివరంగా చూపించారు. పూర్తి స్థాయి పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్నట్లు ఈ ట్రైలర్‌లో కనిపించింది. ఇక, ఇందులో ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, న్యాయ వ్యవస్థను టార్గెట్ చేస్తూ కొన్ని డైలాగులు కూడా వదిలారు.

తాజాగా విడుదలైన 'రిపబ్లిక్' ట్రైలర్‌లో సాయి ధరమ్ తేజ్ నటన ఆకట్టుకుంది. దేవ కట్టా టేకింగ్ కూడా బాగుంది. మణి శర్మ సంగీతం కూడా మెప్పించింది. ఇక, ఇందులో 'సమాజంలో తిరిగే అర్హతే లేని గుండాలు.. పట్టపగలే బాహాటంగా అమాయకుల ప్రాణాలు తీస్తుంటే.. కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థలే వాళ్లకు కొమ్ము కాస్తున్నాయి' 'మీ భయం, అజ్ఞానం, అమాయకత్వం, విశ్వాసమే ఆ సింహాసనానికి నాలుగు కాళ్లు'.. 'అజ్ఞానం గూడు కట్టిన చోటే.. మోసం గుడ్లు పెడుతుంది' అనే డైలాగ్స్ అదిరిపోయాయి. చివర్లో 'దేనికి భయం' అంటూ గర్జించిన సాయి తేజ్.. తన మేనమామ పవన్‌ను గుర్తు చేశాడు.

క్రేజీ కాంబినేషన్‌లో పొలిటికల్ సెటైరికల్ మూవీగా రూపొందిన 'రిపబ్లిక్'లో సాయి ధరమ్ తేజ్ జిల్లా కలెక్టర్‌గా నటిస్తున్నాడు. తన ఉద్యోగాన్ని వదిలేసి హీరో ప్రజల కోసం పోరాటం చేయడం అనే కాస్సెప్టుతో ఇది రూపొందిందట. ఇక, ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ముఖ్యమంత్రి పాత్రను చేస్తున్నారు. అలాగే, ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు కీలక పాత్రను చేశాడు. ఈ సినిమాను భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు సైతం భారీ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X