‘సోలో బ్రతుకే సో బెటర్’ ట్రైలర్ విడుదల: ఫినిషింగ్ టచ్ ఇచ్చిన నారాయణమూర్తి

కెరీర్ ఆరంభంలో కొన్ని విజయాలను అందుకుని సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఆ తర్వాత చాలా రోజుల పాటు వరుస పరాజయాలతో సతమతం అయ్యాడు. ఈ క్రమంలోనే ఆ మధ్య వచ్చిన 'చిత్రలహరి'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ వెంటనే వచ్చిన 'ప్రతిరోజూ పండుగే' సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించాడు. ఈ సినిమా ఇచ్చిన జోష్‌లోనే ప్రస్తుతం 'సోలో బ్రతుకే సో బెటర్' అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'. నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన ఈ మూవీలో నభా నటేష్ హీరోయిన్‌గా చేస్తోంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయినప్పటికీ లాక్‌డౌన్ కారణంగా 'సోలో బ్రతుకే సో బెటర్' రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న దీన్ని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దానికి సమయం దగ్గర పడడంతో ప్రమోషన్‌ను వేగవంతం చేసింది చిత్ర యూనిట్.

Sai Dharam Tejs Solo Brathuke So Better Trailer Released

ఇందులో భాగంగానే 'సోలో బ్రతుకే సో బెటర్' ట్రైలర్‌ను విడుదల చేశారు. కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. హీరో సాయి ధరమ్ తేజ్ కటౌట్లు నిలబెట్టి ఉన్న విజువల్స్‌తో ఇది ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత దానికి గత కారణాలను చెబుతూ తన కథను వివరిస్తాడు హీరో. మొత్తంగా ప్రేమ, పెళ్లి అనేవి లేకపోతే లైఫ్ బాగుంటుంది అని మెసేజ్ ఇస్తారు. ఇక, చివర్లో సీనియర్ హీరో ఆర్ నారాయణ మూర్తి 'ప్రతి ఒక్కరికీ పెళ్లి అవసరం' అన్న డైలాగ్‌తో ఫినిషింగ్ టచ్ ఇవ్వడం ఆకట్టుకుంది. అలాగే, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా మెప్పించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X