ముద్దాడేందుకు పైకి ఎక్కిన మెగా హీరో.. సూపర్ అంటూ నెటిజన్ల కామెంట్స్

మెగా హీరోల్లో గత కొన్నేళ్లు సక్సెస్ రుచికి దూరమయ్యాడు సాయి ధరమ్ తేజ్. అయితే చివరగా వచ్చిన చిత్రలహరి సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేశాడు. సినిమాల విషయం పక్కనపెడితే ఈ సుప్రీమ్ హీరో సింప్లిసిటీకే ఎక్కువ ప్రాధాన్యమిస్తాడు. ఎక్కడా కూడా హడావిడి చేసినట్లు కనిపించదు.

వివాదాలకు దూరంగా..

వివాదాలకు దూరంగా..

ఆడియో ఫంక్షన్లలో కూడా మితిమీరి మాట్లాడటం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లాంటి వాటికి దూరంగా ఉంటాడు. ఎంతో హుందాగా ఓ నాలుగు మాటలు మాట్లాడేసి దిగిపోతాడు. అందర్నీ చక్కగా పలకరిస్తూ.. అందరితో కలిసిమెలిసి ఉంటాడు. అందుకే ఈ హీరోను సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా అభిమానులు ప్రేమిస్తూ ఉంటారు.

ప్రతిరోజూ పండగే అంటూ..

ప్రతిరోజూ పండగే అంటూ..

ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రతిరోజూ పండగే అనే చిత్రాన్ని చేస్తోన్న ఈ హీరో రీసెంట్‌గా తన పుట్టిన రోజును కూడా జరుపుకున్నాడు. బర్త్ డే సందర్భంగా డబ్బులు ఊరికే ఖర్చుచేయకండి.. నాకు పంపించండి.. వాటిని ఓ వృద్దాశ్రమానికి ఇస్తాను.. నేను ఓ ఏడాది పాటు దాని బాధ్యతలు చూసుకుంటానని మానవత్వాన్ని చాటాడు.

ముద్దాడేందుకు..

ముద్దాడేందుకు..

తాజాగా ఓ పిక్ పోస్ట్ చేశాడు ఈ మెగా హీరో. జంతు ప్రేమికుడైనా సాయి ధరమ్ తేజ్.. ఓ కుక్కను పెంచుకుంటూ ఉన్నాడు. దానిపై కూర్చుని ప్రేమగా జట్టును సవరిస్తున్నాడు. ఇప్పుడు దీనికి ముద్దాడటం కావాలి అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. ఇక ఈ ఫోటోను చూసిన అభిమానులు ఎంతో సంబరపడుతున్నారు. మా హీరో ఎంత సింపుల్‌గా ఉన్నాడో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

డిసెంబర్‌లో రానున్న హీరో..

ప్రస్తుతం చేస్తోన్న ప్రతిరోజూ పండగే చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్స్‌తో హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీతో మరో హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాక మరో చిత్రాన్ని కూడా ప్రారంభించేశాడు. సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రాన్ని కూడా చేయనున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కూడా మొదలుకానున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X