మెగా హీరో కూడా బాగానే పెంచేశాడు.. షాక్ అవుతున్న నెటిజన్లు

వరుస ఫ్లాపుల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. ప్రతిరోజు పండగే అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోన్నాడు. చిత్రలహరి విజయం సాధించడంతో తేజు కొత్త ఊపుతో ప్రారంభించిన ఈ చిత్రంపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. తన పంథాను మార్చి కొత్తగా ట్రై చేస్తున్న మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం రావడంతో మరింత హైప్ క్రియేట్ అయింది.

ప్రతిరోజు పండగే అంటూ ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలతో సినిమా జనాల్లోకి బాగానే రీచ్ అయింది. నిన్న విడుదల చేసిన చిన్నతనం అనే ఎమోషనల్ సాంగ్ అందర్నీ కదిలిచింది. ఓ బావా అనే పాట ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉంది. ఇక టీజర్, ట్రైలర్‌లు అన్నీ కూడా ప్రామిసింగ్‌గా అనిపించడంతో సినిమాపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. వచ్చే వారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంలో తేజు పోస్ట్ చేసిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 Sai Dharam Tej Shocking Look For Solo Bathuke So Better

మెగా హీరోల్లో ప్రస్తుతం అందరూ బాడీపై దృష్టిపెట్టారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్స్‌కు ట్రై చేసేశారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కబోతోన్న మూవీ కోసం బాగానే కష్టపడుతున్నాడు. ఇక ఈ జాబితాలోకి సాయి ధరమ్ తేజ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. తన తదుపరి చిత్రం కోసం తేజు బాగానే కష్టపడి బాడీని బిల్డ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తన ట్రైనర్, చరణ్‌కు థ్యాంక్స్ చెబుతూ ఓ పిక్‌ను షేర్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X