థియేటర్స్ లోనే 'సోలో బ్రతుకే సో బెటర్'.. ఎప్పుడంటే?

మొత్తానికి సినిమా థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అయితే జనాలు థియేటర్స్ వరకు వస్తారా రారా అనేది ఇప్పుడున్న బిగెస్ట్ సస్పెన్స్. నిర్మాతలు అయితే చాలా వరకు నమ్మకంగా లేరు. అందుకే పాత సినిమాలను మళ్ళీ విడుదల చేస్తూ చెక్ చేస్తున్నారు. ఇక డిసెంబర్ లో పరిస్థితులు నార్మల్ అవుతాయని నమ్మకంతో ఉన్న కొందరు సినిమాల రిలీజ్ లపై క్లారిటీ ఇస్తున్నారు. ఇక త్వరలో సాయి ధరమ్ తేజ్ సినిమా కూడా విడుదల కానున్నట్లు చెప్పేశారు.

యువ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రతి రోజు పండగే లాంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాలో నటించాడు. ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తయ్యాయి. అయితే కరోనా లాక్ డౌన్ దెబ్బకు వాయిదా వేయక తప్పలేదు. ఇక థియేటర్స్ ఓపెన్ అవుతుండడంతో చాలా మంది ఫెస్టివల్స్ ని టార్గెట్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కూడా డిసెంబర్ లో క్రిస్టమస్ ని టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ లో సినిమాను అయితే రిలీజ్ చేయాలని నిర్మాత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు గాని డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ చేసుకోలేదు.

Sai dharam tej Solo brathuke ao better movie release update

ఇక డిసెంబర్ క్రిస్టమస్ కి నితిన్ రంగ్ దే సినిమా కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆ సినిమా రిలీజ్ పై రూమర్స్ గట్టిగానే వచ్చాయి. ఇక సంక్రాంతిని టార్గెట్ చేస్తున్న సినిమాల లిస్ట్ కూడా పెద్దగానే ఉంది. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, అలాగే మరికొందరు ఆగ్ర హీరోలు పొంగల్ కి సినిమాలను రెడీ చేయాలని చూస్తున్నారు. మరి వారి ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X