Don't Miss!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్‌పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- News సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లేవారికి గుడ్ న్యూస్
- Automobiles కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఇటీవలే ప్రతీ రోజు పండగే సినిమాతో సక్సెస్ సాధించిన సాయి ధరమ్ తేజ్ ఇక 'సోలో బ్రతుకే సో బెటర్' అంటున్నాడు. జయాపజయాలకు లెక్కచేయకుండా వరుస సినిమాలు చేస్తున్న ఈ హీరో ఈ సారి డిఫరెంట్ కథాశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ యెన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ సినిమాకు కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని మే 1 న విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ మూవీ టైటిల్ సాంగ్ వీడియోను వాలెంటైన్స్ డే సందర్బంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఈ సందర్బంగా సాయి ధరమ్ తేజ్ 'సోలో సోదర సోదరీమణులారా.. ఈ వాలెంటైన్స్ వీకెండ్ మనమంతా కలిసి జరుపుకుందాం.. మన స్లోగన్ ఒక్కటే.. 'సోలో బ్రతుకే సో బెటర్'..' అని ట్వీట్ చేశారు.
ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ డిఫెరెంట్ లుక్ కనిపించనున్నాడని తెలుస్తోంది. యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా రూపొందించబడుతున్న ఈ సినిమా మెగా మేనల్లుడి కెరీర్ లో ది బెస్ట్ మూవీ అవుతుందని అంటున్నారు మేకర్స్. చూడాలి మరి సోలో బ్రతుకు గురించి సాయి ధరమ్ తేజ్ ఎలాంటి విషయాలు చెబుతాడో.
సోలో సోదర సోదరీమణులారా...ఈ valentines weekend మనం అంతా కలిసి జరుపుకుందాం...మన slogan ఒకటే...సోలో బ్రతుకే సో బెటర్ 💪🏼 #SBSBFromMay1st @SVCCofficial @MusicThaman @NabhaNatesh @subbucinema #solobrathukesobetter pic.twitter.com/bDCgGzk1wL
— Sai Dharam Tej (@IamSaiDharamTej) February 1, 2020