దేశ సైనికుల కోసం సాయిధరమ్ తేజ్ షార్ట్ ఫిలిం.. కలర్ స్వాతి, నవీన్ విజయకృష్ణతో సత్య ఆఫ్ సోల్‌!

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. యాక్సిడెంట్ తర్వాత ఆయన నటించిన విరూపాక్ష, బ్రో ది అవతార్ చిత్రాలు భారీ విజయాలను అందుకొన్నాయి. ఈ విజయాల తర్వాత సాయిధరమ్ తేజ్ ఓ షార్ట్‌ఫిలింలో నటించారు. ఈ చిత్రానికి వీకే నరేష్ కుమారుడు నవీన్ దర్శకత్వం వహించారు. ఈ షార్ట్‌ ఫిలిం తన స్నేహితులు హర్షిత్ రెడ్డి, నవీన్ కోసమే చేశానని ఇటీవల బ్రో ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే పంద్రాగస్టు కానుకగా రిలీజ్ అవుతున్న ఈ షార్ట్ ఫిలిం గురించిన వివరాల్లోకి వెళితే..

దేశానికి సేవలు అందిస్తున్న సైనికుల కోసం సోల్ ఆఫ్ సత్య అనే షార్ట్ ఫిలిం తీశారు. ఈ షార్ట్ ఫిలిం టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ షార్ట్ ఫిలింలో కలర్స్ స్వాతి కనిపించడం అభిమానులకు సర్‌ప్రైజ్‌గా మారింది. సోల్ ఆఫ్ సత్య గ్లిప్ల్స్ కూడా అందర్నీ ఆకట్టుకొంటుందని దర్శక, నిర్మాతలు అన్నారు.

Sai Dharam Tejs Soul of Satya Short film teaser released

సాయిధరమ్ తేజ్, స్వాతి పెళ్లి చేసుకోవడం ద్వారా సోల్ ఆఫ్ సత్య గ్లింప్స్ మొదలవుతుంది. పెళ్లి సమయంలో వారిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకొంటూ కనిపిస్తారు. ఈ షార్ట్ ఫిలిం కోసం టాలెంటెడ్ సింగర్ శృతి రంజన్ ఓ పాటను కంపోజ్ చేశారు. ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నారు.

సోల్ ఆఫ్ సత్య షార్ట్ ఫిలింలో సాయిధరమ్ తేజ్ సోల్జర్‌గా నటిస్తున్నారు. దేశానికి సేవ చేసే సైనికుడి భార్య కథగా ఈ షార్ట్ ఫిలిం తెరకెక్కింది. సత్య గురించిన కథలో ఉండే ఎమోషన్స్ మీ హృదయాలను తట్టి లేపుతుంది. సైనికుల త్యాగాలను ప్రపంచానికి తెలియజెప్పాలని ఉద్దేశంతో షార్ట్ ఫిలిం నిర్మించాం. సాయి ధరమ్ తేజ్, స్వాతి నటన ఈ షార్ట్ ఫిలింకు హైలెట్ అవుతుందని భావిస్తున్నారు.

సోల్ ఆఫ్ సత్యకు బలగం నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ షార్ట్ ఫిలింను దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాకు నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ షార్ట్ ఫిలింకు సాకేత్ కొమండూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X