HBD Sai Dharam Tej: ఊరమాస్ టైటిల్‌తో సాయి తేజ్.. స్పైడర్ మ్యాన్‌కు మించేలా!
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినిమాల్లోకి వచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్నింట్లోనూ తనదైన మార్కును చూపిస్తూ సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు సాయి ధరమ్ తేజ్. చాలా కాలం పాటు వరుసగా సినిమాలు చేసిన అతడు.. యాక్సిడెంట్ తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాడు. ఆ తర్వాత 'విరూపాక్ష'తో రీఎంట్రీ ఇచ్చి బిగ్ హిట్‌ను కొట్టేశాడు.
'విరూపాక్ష' చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో సాయి ధరమ్ తేజ్‌లో ఉత్సాహం భారీగా పెరిగింది. ఈ జోష్‌లోనే అతడు ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి 'బ్రో' అనే సినిమాను చేశాడు. ఆ వెంటనే ఈ సుప్రీమ్ హీరో పలు ప్రాజెక్టులను సైతం లైన్‌లో పెట్టుకున్న విషయం తెలిసిందే. వాటిని ఒక్కొక్కొటిగా స్టార్ట్ చేయాలని ఇప్పటికే డిసైడ్ అయ్యాడు.

చాలా రోజుల క్రితమే సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్‌లో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరొందిన సంపత్ నందితో కలిసి ఓ మాస్ మసాలా మూవీని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీన్ని ఎప్పుడో ప్రారంభించాల్సి ఉన్నా సాయి తేజ్ రెస్ట్ మోడ్‌లో ఉండడంతో లేట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో కూడిన వీడియోను రిలీజ్ చేశారు.
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నేడు పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. దీన్ని పురస్కరించుకుని ఈ మూవీ నుంచి ఫస్ట్ హై వీడియోను రిలీజ్ చేశారు. 'గాంజా శంకర్' అనే మాస్ టైటిల్‌తో ఈ సినిమా రాబోతుంది. ఇక, తాజాగా విడుదలైన వీడియోలో ఈ సినిమా థీమ్‌ను చూపించారు. ముఖ్యంగా ఇందులో హీరో క్యారెక్టరైజేషన్‌ను ఓ రేంజ్‌లో హైలైట్ చేశారనే చెప్పాలి.
'గాంజా శంకర్' వీడియో ఓ తండ్రి తన కూతురికి సూపర్ మ్యాన్ కథ చెప్పడంతో మొదలైంది. అప్పుడా చిన్నారి 'అబ్బా ఈ స్పైడర్ మ్యాన్‌లు, సూపర్ మ్యాన్‌లు కాదు నాన్న.. మన లోకల్ హీరో కథ ఉంటే చెప్పు నాన్న' అని అడుగుతుంది. అప్పుడు ఆ తండ్రి సుప్రీమ్ హీరో కథ చెప్తానంటూ ఈ వీడియోలోకి తీసుకెళ్తాడు. ఇందులో సాయి తేజ్ లుక్, ఎలివేషన్ ఫెంటాస్టిక్‌గా ఉంది. మొత్తంగా ఈ వీడియో అన్ని వర్గాల వాళ్లను ఆకట్టుకునేలా కట్ చేశారు.
సాయి ధరమ్ తేజ్ - సంపత్ నంది కాంబినేషన్‌లో రాబోతున్న 'గాంజా శంకర్' సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. త్వరలోనే ఇది రెగ్యూలర్ షూట్‌ను జరుపుకోనుంది.


Click it and Unblock the Notifications











