మెగా హీరో సమయస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా.. సలామ్ అంటూ కామెంట్స్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. సామాజిక సమస్యలపైనా స్పందిస్తూ అభిమానుల ప్రేమను సంపాదించుకుంటున్నాడు. ఆ మధ్య ఆయన పుట్టిన రోజు వేడుకులను అట్టహాసంగా జరిపించవద్దని సుప్రీమ్ హీరో కోరాడు. ఆ డబ్బులను అవసరమైన, సహాయం కోసం ఎదురుచూసే వారికి అందించాలని కోరుతూ ఓ వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మెగా హీరో సందేశం ఇచ్చిన తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది.

 సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి ఘటన..

సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి ఘటన..

ప్రియాంక రెడ్డి హత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ మొత్తం ఏకతాటిపైకి వచ్చి ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. స్టార్ హీరోల నుంచి సాధారణ ప్రజల వరకు అందరూ ఈ ఘటనను వ్యతిరేకిస్తూ తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సాయి ధరమ్ తేజ్ కూడా స్పందించాడు. అయితే మరోసారి ఈ ఘటనను ఉద్దేశించి మెగా హీరో చేసిన ట్వీట్ హల్ చల్ చేస్తోంది.

రాశీ ఖన్నా బర్త్ డే సందర్భంగా ట్వీట్..

రాశీ ఖన్నా బర్త్ డే సందర్భంగా ట్వీట్..

రాశీ ఖన్నా పుట్టిన రోజు సందర్భంగా.. సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్, దానికి కౌంటర్‌గా మారుతి వేసిన ట్వీట్.. ఆ కౌంటర్‌కు సాయి ధరమ్ తేజ్ వేసిన రివర్స్ కౌంటర్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. రాశీ ఖన్నా హీరో మీద చేయి వేసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. హాత్ నికాలో, చేయి తీయ్.. మీ ఫ్యాన్స్ నాపై అరుస్తున్నారంటూ చేసిన ట్వీట్ ఎంతగా హల్ చల్ చేసిందో అందరికీ తెలిసిందే.

రియాక్ట్ అయిన రాశీ ఖన్నా ఫ్యాన్స్..

సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ ట్వీట్‌కు భారీ స్పందన వచ్చింది. సోషల్ మీడియాలో కుప్పలుకుప్పలుగా మీమ్స్ హల్ చల్ చేశాయి. అవన్నీ మెగా హీరో వద్దకు చేరాయి కూడా. మా హీరోయిన్ మీద చేయి వేస్తావా.. చేయి తీ, హాత్ నికాలో అంటూ కామెంట్స్ చేయడం, సాయి ధరమ్ తేజ్ వైపు గుర్రుగా చూడటం లాంటివి హైలెట్ అయ్యాయి.

Recommended Video

#CineBox : Prabhas To Have Dual Role In His Next Period Drama 'Jaan' ?
అందరి పట్ల బాధ్యతగా ఉండాలి..

అందరి పట్ల బాధ్యతగా ఉండాలి..

రాశీ ఖన్నా అభిమానులు చేసిన కామెంట్స్, రియాక్ట్ అయిన పద్దతిని ఉద్దేశిస్తూ.. మీ ఫేవరెట్ హీరోయిన్ మీద చేయి వేస్తే అది సినిమాలో భాగమని తెలిసినా చేయి తీయమన్నారు.. మన చుట్టూ ఉన్న అమ్మాయిల్ని కూడా ఇంతే ప్రేమగా, భాద్యతగా చూసుకోగలిగితే సొసైటీలో ప్రియాంక లాంటి బాధితులు ఉండరు కదా అంటూ తన అభిప్రాయాన్ని తెలిపాడు. తేజ్ చేసిన ఈ ట్వీట్‌పై సలామ్ అంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X