కృష్ణమ్మకు సాయిధరమ్ తేజ్ చేయూత.. కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్ మూవీ
ఆచార్య సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో కృష్ణ కొమ్మలపాటి రూపొందుతున్న చిత్రం కృష్ణమ్మ. విభిన్నమైన పాత్రలు, విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న సత్యదేవ్ హీరోగా నటిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన గాడ్సే, ఆచార్య చిత్రాలు నటుడిగా మరో మెట్టును ఎక్కించాయి. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో కలిసి గాడ్‌ఫాదర్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

తాజాగా సత్యదేవ్ హీరోగా నటిస్తున్న కృష్ణమ్మ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గురువారం కృష్ణమ్మ టీజర్‌ను హీరో సాయి ధరమ్ తేజ్ విడుదల చేసి చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు.
కృష్ణమ్మ టీజర్ 1 నిమిషం 19 సెకన్లు ఉంది. సినిమాలోని ఇంటెన్సిటీ, సత్యదేవ్ రస్టిక్ లుక్ ఆకట్టుకొన్నది. టీజర్‌లో సత్యదేవ్ వాయిస్ ఓవర్‌తో కథను వివరిస్తున్నారు. తన వాయిస్ తెలియని ఓ భయాన్ని క్రియేట్ చేస్తోంది. ఈ కృష్ణమ్మలాగే మేము ఎప్పుడు పుట్టామో ఎక్కడ పుట్టామో ఎవరికీ తెలియదు అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో టైటిల్ పెట్టడానికి గల కారణాన్ని టీజర్‌లో చూపించారు.
ఓ చిన్న పట్టణంలో ఉండే ముగ్గురు స్నేహితులు, ఓ విలన్‌కి మధ్య జరిగే సంఘర్షణే కృష్ణమ్మ సినిమా. ఓ చిన్న ఘటన వారి ముగ్గురి జీవితాలను ఎలా మలుపు తిప్పిందనేదే సినిమా కథ. కాల భైరవ బ్యాగ్రౌండ్ స్కోర్, టీజర్‌లో చూపించిన సత్యదేవ్ ఆవేశం సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచాయి. టీజర్ చూస్తుంటే ఇదొక యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. సినిమా విడుదల కోసం సత్యదేవ్ ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీలో తమ అభిమాన హీరోను చూడాలనే వారి కోరిక కృష్ణమ్మ చిత్రంతో తీరనుంది. త్వరలోనే సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాల భైరవ సంగీతం అందించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











