థియేటర్స్ ఓపెన్ అయితే చాలు.. మెగా హీరో డబుల్ ధమాకా
మెగా మేనల్లుడు సాయి ధరమ్ మొత్తానికి చివరి రెండు సినిమాలతో మంచి హిట్స్ అయితే అందుకున్నాడు. చిత్రలహరి సినిమాతో పాటు ప్రతి రోజు పండగే సినిమా కూడా సాయి కెరీర్ కు రెండు రకాలుగా బూస్ట్ ఇచ్చాయి. ఒకటి నటుడిగా మంచి గుర్తింపు అందిస్తే మరొకటి బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందించింది. ఇక నెక్స్ట్ కెరీర్ లో వీలైనంత వరకు రొటీన్ సినిమాలు చేయకుండా కాస్త విభిన్నంగా ఆలోచించాలని డిసైడ్ అయ్యాడు.
నెక్స్ట్ సాయి ధరమ్ తేజ్ నుంచి వచ్చే సినిమాలు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనే చెప్పాలి. ముందుగా సోలో బ్రతుకు సో బెటర్ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత వచ్చే రెండు సినిమాలు కూడా డిఫరెంట్ జానర్స్ లో రానున్నాయి. దేవకట్టా దర్శకత్వంలో చేస్తున్న సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కుతుండగా అందులో సాయి ఒక ఐఎస్ అఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే 60% శాతం షూటింగ్ కూడా పూర్తయ్యిందట.

ఆ తరువాత సుకుమార్, బీవీఎస్ఏం బ్యానర్ లో రూపొందుతున్న సినిమా థ్రిల్లర్ జానర్ లో రానుంది. కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఆ సినిమా బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ తో రానున్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే సాయి ధరమ్ తేజ్ పూర్తిగా తన స్టైల్ ను మార్చేసినట్లు అర్ధమవుతోంది. వీలైనంత వరకు విభిన్నమైన కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఇక థియేటర్స్ ఓపెన్ అయితే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఆ రెండు సినిమాలు ఎలాంటి రిజల్ట్ ను అందిస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











