Virupaksha Trailer: చావుకు ఎదురుగా విరుపాక్ష.. చేతబడి మాయపై ఊరి కోసం పోరాటం
సాయి ధరమ్ తేజ్ సంయుక్త జంటగా నటించిన విరుపాక్ష సినిమా ఈనెల 21వ తేదీన గ్రాండ్ గా ప్లాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. ఇక సుకుమార్ రైటింగ్స్ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను BVS ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక సుకుమార్ కూడా ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించగా ఆయన శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ను కొద్దిసేపటి క్రితం విడుదల చేయగా సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఇక ట్రైలర్ ఏ విధంగా ఉంది అనే వివరాల్లోకి వెళితే...
హీరో ఎంట్రీ:ట్రైలర్ మొదలవగానే హీరో ఒక మారుమూల గ్రామానికి వెళుతూ ఉండడం.. ఇక బ్యాక్ గ్రౌండ్లో నేను పుట్టి పెరిగిన ఊరు వదిలి వచ్చి 15 ఏళ్ళు అయింది అని అనడంతో అప్పుడే ఒక కాకి హీరో కారు మీద పడడం తోనే ట్రైలర్ చాలా ఆసక్తికరంగా మొదలైంది. ఇక ఊరిలోకి ఎవరు రాకూడదు అనే బోర్డ్ కూడా ఉండడంతో హీరో ఎలా ముందుకు వెళ్ళాడు అని లైన్ కూడా ఆసక్తిగా అనిపిస్తోంది.

మిస్టరీ విలేజ్ లో:ఒక మిస్టరీ విలేజ్ లో ఉండే మరణాల గురించి హీరో ఏ విధంగా రీసెర్చ్ చేశాడు ఇక వచ్చే ప్రమాదాలను ఏ విధంగా ఆపాడు అనే ప్రశ్నలు ఈ సినిమాలో ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి అని అనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో చేతబడి వంటి అంశాలను కూడా హైలెట్ చేసి చూపించబోతున్నట్లు ఇదివరకే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.
మూఢనమ్మకాలు, చేతబడులు:అప్పట్లో మూఢనమ్మకాలు చేతబడులు ఎలా ఉండేవి అనే పాయింట్ లో దర్శకుడు ఈ సినిమాను ఒక హారర్ త్రిల్లర్ కాన్సెప్ట్ తోనే తెరపైకి తీసుకువచ్చాడు. అయితే ఒకవైపు భయాన్ని కలిగించే ఈ సినిమాలో మరోవైపు మంచి లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకుంటుంది అని అర్థమవుతుంది. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ కు జోడిగా సంయుక్త నటించింది. ఇక వీరిద్దరి మధ్య వచ్చే లవ్ సీన్స్ కూడా హైలెట్ కాబోతున్నట్లు ట్రైలర్లో తెలియజేశారు.

ఊరు మొత్తం అంతమైపోతుంది:ఇక గ్రహణం పూర్తయ్యే లోపు ఊరు మొత్తం అంతమైపోతుంది అని పాయింట్ తో సినిమా చాలా ఆసక్తిగా ఉండబోతుందట. ఇక హీరో మిస్టరీ వెనుక ఉన్న కారణాలు ఏంటి చేతబడులు ఎవరూ చేశారు? ఇక దాన్ని ఎలా అడ్డుకోవాలి? మిగతా జనాలను ఎలా కాపాడాలి? అనే సవాళ్ళు ఉండడం సినిమా మొత్తానికి ఒక హైలెట్ గా నిలవబోతుంది.
చావుకు ఎదురు వెళ్లే దమ్ముందా?:సునీల్ కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక్కడ ఎవరికైనా చావుకు ఎదురు వెళ్లే దమ్ముందా? అని అతను చెప్పిన డైలాగ్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇక జరగబోయే మరణ హోమాన్ని ఆపలేవు అని సవాళ్లను హీరో ఎదుర్కోబోతున్నాడు. సమస్యకు పరిష్కారం నేను వెతుకుతాను అంటూ అతను చెప్పిన డైలాగ్ కూడా హైలెట్ అవుతుంది. ఈ రుద్రవనాన్నిన్ని కాపాడగల వీరుపాక్షకుడు నువ్వే అంటూ మరో క్యారెక్టర్ చెప్పిన విధానంతో కూడా ఇందులో హీరోయిజం గట్టిగానే ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











