మరోసారి సోలోగా రాబోతున్న సాయి ధరమ్ తేజ్.. రిపబ్లిక్ రిలీజ్ డేట్ ఫిక్స్

కరోనా కష్టకాలంలో అసలు సినిమాలు విడుదలవ్వడమే అనుమానం అనుకున్న తరుణంలో.. లాక్ డౌన్ తరువాత సినిమాలు రిలీజ్ అవ్వడం బాక్సాఫీస్ హిట్ అవ్వడం అన్ని చాలా స్పీడ్ గా జరిగిపోయాయి. ఒక విధంగా ఇండస్ట్రీకి మంచి బూస్ట్ వచ్చిందనే చెప్పాలి. ముందుగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకు సో బెటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరవలేదనిపించే విధంగా కలెక్షన్స్ ను అందుకుంది.

మిగతా హీరోలు కూడా చేతిలో ఉన్న సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈ క్రమంలో మెగా హీరో సాయి మరింత స్పీడ్ పెంచాడు. ఈ ఏడాదిలో ఎలాగైనా రెండేసి సినిమాలను విడుదల చేయడానికి రెడీ అవుతున్నాడు. దేవకట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ అనే సోషల్ డ్రామాలో నటిస్తున్న సాయి ఆ సినిమాను జూన్ 4న రిలీజ్ చేయాలని ఫిక్స్ ఆయాడు.

 Sai dharam tej upcoming project republic release date fix

అందుకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతనికైతే జూన్ లో ఏ సినిమా విడుదల తేది కూడా ఫిక్స్ కాలేదు. కానీ సాయి ధరమ్ తేజ్ సోలోగా రావడానికి రెడీ అయ్యాడు. ఇక సుకుమార్ ప్రొడక్షన్ లో ఆయాన శిష్యుడు కార్తిక్ దండు డైరెక్ట్ చేస్తున్న మరో మూవీని కూడా ఈ ఏడాది చివరలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. కుదిరితే డిసెంబర్ 24న ఆ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుందట. సాయి గత రెండు సినిమాలు కూడా డిసెంబర్ లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్నాయి.

 Sai dharam tej upcoming project republic release date fix

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X