ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఎంచుకుంటున్న కథలు ఈ మధ్య బాగానే క్లిక్కవుతున్నాయి. రొటీన్ గా కమర్షియల్ ఫార్మాట్ లో వెళ్లకుండా కొన్ని డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నాడు. దేవకట్టా దర్శకత్వంలో ఒక పొలిటికల్ డ్రామాలో నటిస్తున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక మోషన్ పోస్టర్ తో సినిమాపై టైటిల్ పై ఒక క్లారిటీ ఇచ్చేశారు.
ప్రస్థానం తరువాత ఇంతవరకు అంతగా మెప్పించని దర్శకుడు దేవకట్టా ఈ సారి మంచి కాన్సెప్ట్ తో రాబోతున్నట్లు అర్ధమవుతోంది. సాయి ధరమ్ తేజ్ తో 'రిపబ్లిక్' అనే సినిమాను చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. "ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులు, శాసనాల్ని అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయాని కాపాడే కోర్టు.. ఈ మూడు గుర్రాలు ఒకరి తప్పును ఒకరి దిద్దుకుంటు.. క్రమబద్ధంగా సాగినప్పుడే అది ప్రజా స్వామ్యం అవుతుంది. ప్రభుత్వం అవుతుంది. అదే అసలైన రిపబ్లిక్" అని వాయిస్ ఓవర్ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్.

చూస్తుంటే సినిమా మంచి సందేశంతో తెరకెక్కుతున్నట్లు అర్ధమవుతోంది. ఇక సినిమాను సమ్మర్ లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇక సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుండగా రమ్యకృష్ణ, జగపతిబాబు వంటి సీనియర్ స్టార్స్ కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక సినిమాకు సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ బాణీలు అందించబోతున్నాడు. మరి సినిమా సాయి ధరమ్ తేజ్ కు ఎలాంటి బూస్ట్ ఇస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











