Virupaksha Title Glimpse: పవన్ టైటిల్‌తో సాయి ధరమ్ తేజ్.. ఎన్టీఆర్ డైలాగ్ హైలైట్

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. చాలా తక్కువ సయమంలోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా పలు విభాగాల్లో అదగొడుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే పలు విజయాలను కూడా అందుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడి గత చిత్రం 'రిపబ్లిక్' మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీనికితోడు యాక్సిడెంట్ అవడం వల్ల సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా మరింత ఆలస్యం అయింది. ఈ నేపథ్యంలో తాజాగా అతడి మూవీ నుంచి ట్రీట్ వచ్చింది.

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం తన 15వ చిత్రాన్ని కార్తీక్ దండు అనే దర్శకుడితో చేస్తున్నాడు. చాలా రోజుల క్రితమే ప్రారంభం అయిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో విభిన్నమైన కథతో రూపొందుతోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు 'విరూపాక్ష' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వాస్తవానికి ఈ పేరును పవన్ కల్యాణ్ కోసం క్రిష్ జాగర్లమూడి రిజిస్టర్ చేయించినట్లు వార్తలు వచ్చాయి. దాన్నే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కోసం వాడుకున్నారు. అలాగే, ఈ మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న 'విరూపాక్ష' మూవీ టైటిల్ గ్లింప్స్‌కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. గంభీరమైన స్వరంతో అతడు 'అజ్ఞానం భయానికి మూలం.. భయం మూఢ నమ్మకానికి కారణం.. ఆ నమ్మకమే నిజమైనప్పుడు.. ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు.. అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం' అంటూ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా ఉంది. ఇక, ఇందులో విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. దీంతో ఈ వీడియోకు చాలా తక్కువ సమయంలోనే విశేషమైన స్పందన దక్కుతోంది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారిపోయింది.

Sai Dharam Tej Virupaksha Movie Title Glimpse Released

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందుతోన్న 'విరూపాక్ష' మూవీలో సాయి ధరమ్ తేజ్‌కు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది ఏప్రిల్ 21, 2023న విడుదల కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X