గల్లీ బాయ్ చిత్రంపై మెగా హీరో ఆసక్తి.. తెలుగులో రీమేక్!
మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం చిత్రలహరి చిత్రంలో నటిస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తేజు కెరీర్ కు చాలా కీలకం. సాయి ధరమ్ తేజ్ నటించిన గత చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. దీనితో తేజు చిత్రలహరిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిస్తున్నాడు. కాగా ఇటీవల బాలీవుడ్ లో విడుదలై మంచి విజయం దిశగా దూసుకుపోతున్న గల్లీ బాయ్ చిత్రంపై సాయిధరమ్ తేజ్ ఆసక్తిగా ఉన్నాడని ప్రచారం జరుగుతోంది.
గల్లీ బాయ్ చిత్రం తేజుని వివరీతంగా ఆకట్టుకునట్లు తెలుస్తోంది. రణవీర్ సింగ్, అలియా భట్ ఈ చిత్రంలో జంటగా నటించారు. గల్లీ బాయ్ రీమేక్ హక్కులకు మంచి డిమాండ్ పెరుగుతోంది. ఈ చిత్రం తెలుగులో రీమేక్ చేస్తే బాగా వర్కౌట్ అవుతుందని తేజు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డీల్ చేయగల సరైన దర్శకుడు దొరికితే రీమేక్ ని పట్టాలెక్కించాని సాయిధరమ్ తేజ్ భావిస్తున్నాడు.

ఇక చిత్రలహరి చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కళ్యాణి ప్రియదర్శన్, నివేత పెతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. త్వరలో ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని విషయాలు త్వరలో తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











