సాయి ధరమ్ తేజ్‌ నుంచి అదిరిపోయే అప్‌డేట్: ముహూర్తం వెల్లడించిన ‘రిపబ్లిక్’ యూనిట్

'చిత్రలహరి' అనే సినిమా నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. రెండేళ్ల క్రితం మారుతి తెరకెక్కించిన 'ప్రతి రోజూ పండగే'తో కెరీర్‌లోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అతడు.. లాక్‌డౌన్ తర్వాత వచ్చిన 'సోలో బ్రతుకే సో బెటర్'తో మరో సూపర్ హిట్‌ను అందుకుని హ్యాట్రిక్ కొట్టేశాడు. ఈ జోష్‌లో ఉన్న మెగా హీరో.. ఆ వెంటనే 'రిపబ్లిక్' అనే మరో సినిమాను సైతం పట్టాలెక్కించేశాడు. దీని ద్వారా సాయి ధరమ్ తేజ్ తొలిసారి పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో సినిమా చేస్తున్నాడు. ఇక, ఈ మూవీ టీజర్ గురించి చిత్ర యూనిట్ అప్‌డేట్ ఇచ్చింది.

విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు దేవ కట్టా. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్‌తో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న చిత్రమే 'రిపబ్లిక్'. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. అందులో 'డెబ్బై నాలుగేళ్లుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బ్రతుకుతున్నాం. కానీ, మనకు ఇంకా ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలీదు' అంటూ ఓ డైలాగును ఉంచి సినిమా కాన్సెప్టును చెప్పకనే చెప్పారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 5న ఈ సినిమా టీజర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Sai Dharam Tejs Republic Movie Teaser Release Date Update

రాజకీయ నేపథ్యంతో రాబోతున్న 'రిపబ్లిక్' మూవీని భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కొల్లేరు సరస్సు సమస్యలపై ఈ మూవీ రూపొందుతోందని అంటున్నారు. ఇది జూన్ 4న విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X