twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వంగవీటి వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న డైరెక్టర్.. రాధా సపోర్ట్ కావాలంటూ!

    |

    వంగవీటి ఫ్యామిలీ గురించి దాదాపు తెలుగు ప్రజలందరికీ తెలుసు. విజయవాడకు చెందిన ఒక పొలిటికల్ లీడర్ గా ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే అనూహ్యంగా హత్యకు గురికావడంతో ఆయన హత్యానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అట్టుడికిపోయింది. ఒక కరెక్ట్ సినిమాకు సంబంధించిన అనేక హీరో ఎలిమెంట్స్ ఆయన జీవిత కథలో ఉన్నాయి. అందుకే రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు కూడా రిస్క్ చేసి మరీ వంగవీటి అనే సినిమా రూపొందించారు. అయితే ఈ సినిమా ఏకపక్షంగా ఉంది అంటూ కామెంట్స్ వినిపించినా సరే సినిమా మాత్రం మంచి పేరు తెచ్చుకుంది.

    అయితే ఇప్పుడు వంగవీటి జీవిత చరిత్ర బేస్ చేసుకుని ఒక వెబ్ సిరీస్ చేయాలని అనుకుంటున్నాను అని ప్రకటించాడు తెలుగు దర్శకుడు సాయికిరణ్ అడవి. తెలుగులో కర్మ అనే సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన ఆ తర్వాత కిస్, వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, కేరింత, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ వంటి సినిమాలు రూపొందించారు. ప్రస్తుతానికి ఆయన ఎలాంటి సినిమా అనౌన్స్ చేయలేదు. చివరిగా ఆయన చేసిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అనే సినిమా 2019లో రిలీజ్ కాగా ఈ సినిమా అంతగా పేరు తెచ్చుకోలేదు. అయితే ఆయన వంగవీటి జీవిత కథ ఆధారంగా ఒక వెబ్ సిరీస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నా అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించి ఆసక్తి రేకెత్తించారు.

     sai kiran adivi is planning a web series based on vangaveeti family

    తాజాగా వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ తన సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో షేర్ చేశారు. ఆ ఫోటోకి కామెంట్ పెట్టిన సాయి కిరణ్ అడివి తాను వంగవీటి కుటుంబాన్ని బేస్ చేసుకుని ఒక వెబ్ సిరీస్ తీయాలని అనుకుంటున్నాం అని కానీ దీనికి వంగవీటి రాధాకృష్ణ ఎంత వరకు సపోర్ట్ చేస్తారో తెలియదు అని కామెంట్ చేశారు. అయితే దీనికి వంగవీటి రాధాకృష్ణ నుంచి ఎలాంటి స్పందన రాలేదు కానీ చాలామంది మీకు మేము సపోర్ట్ గా ఉంటాము అంటూ కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. మరి చూడాలి ఇది ఎంతవరకు సఫలీకృతం అవనుంది అనేది.

    English summary
    Sai Kiran Adivi is a writer and director, known for Village lo Vinayakudu (2009), Operation Gold Fish (2019) and Kerintha (2015).he says that he is planning a web series based on vangaveeti family
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X