ప్రభాస్‌ మూవీకి డైరెక్టర్‌గా బిగ్ బాస్ కంటెస్టెంట్.. పాన్ ఇండియా మూవీలో క్రేజీ రోల్ కూడా!

రెబెల్ స్టార్ ప్రభాస్.. ఈ పేరుకు అస్సలు పరిచయమే అవసరం లేదు. అంతలా ఈ బడా హీరో సుదీర్ఘ కాలంగా సినీ రంగంలో ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోన్నాడు. అదే సమయంలో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ప్రభాస్ సరైన హిట్లు కొట్టట్లేదు. కానీ, 'సలార్' మూవీతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.

'సలార్: సీజ్‌ఫైర్'తో ఫామ్‌లోకి వచ్చేసిన ప్రభాస్.. ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'కల్కీ 2898 ఏడీ', 'సలార్ 2', 'స్పిరిట్' మూవీలతో పాటు 'ది రాజా సాబ్' సినిమాలోనూ నటిస్తున్నాడు. మారుతి ఈ సినిమాను రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయని చెప్పొచ్చు.

Sai Kumar Pampana Turns Assistant Director For Prabhas The Raja Saab Movie

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తోన్న 'ది రాజా సాబ్' చిత్రం హర్రర్ కామెడీతో రూపొందుతోంది. అసలు అధికారికంగా ప్రకటించకుండానే ఈ సినిమాను సీక్రెట్‌గానే మొదలు పెట్టి చాలా షెడ్యూళ్లను జరిపారు. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించి 40 శాతం వరకూ టాకీ పార్టును కూడా పూర్తి చేశారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

'ది రాజా సాబ్' మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతుంది. దీంతో ఈ చిత్రంలో ఎంతో మంది బడా స్టార్లు భాగం అవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ సహా పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను ఎంపిక చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇందులో ఒకప్పటి కమెడియన్, బిగ్ బాస్ ఫేం కుమార్ సాయి కూడా నటించడంతో పాటు డైరెక్షన్ చేస్తున్నట్లు తెలిసింది.

Sai Kumar Pampana Turns Assistant Director For Prabhas The Raja Saab Movie

చాలా కాలంగా వెండితెరకు దూరంగా ఉన్న కుమార్ సాయి 'ది రాజా సాబ్' మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడట. అంతేకాదు, ఇందులో ఓ ముఖ్యమైన పాత్రను కూడా చేస్తున్నాడు. ఈ విషయాన్ని అతడే తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కుమార్ సాయి.. ప్రభాస్ మూవీలో ఆఫర్ అందుకున్నాడని తెలిసిన వాళ్లంతా.. అతడు లక్కీ ఛాన్స్ కొట్టేశాడని అంటున్నారు.

ఇదిలా ఉండగా.. హై రేంజ్‌లో రాబోతున్న 'ది రాజా సాబ్' చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X