నేచురల్ బ్యూటీతో విజయ్ దేవరకొండ రొమాన్స్.. వీళ్లను ఎవరు కలిపారో తెలుసా?
స్వయంకృషితోనే సినిమా కెరీర్‌ను ప్రారంభించిన హీరోలు టాలీవుడ్‌లో చాలా మందే ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే తక్కువ చిత్రాలకే ఎక్కువగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ ఒకడు. ఆరంభంలో వరుసగా హిట్లు కొట్టిన అతడు.. ఇప్పుడు సరైన సక్సెస్ లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు.
వరుస ఫ్లాపులతో సతమతం అవుతోన్న విజయ్ దేవరకొండ ఇటీవలే 'ఫ్యామిలీ స్టార్' అనే సినిమాతో వచ్చాడు. కానీ, ఇది అతడికి నిరాశనే మిగిల్చింది. దీంతో ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తున్నాడు. ఇలా ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేసే సినిమా షూట్‌లో కూడా పాల్గొంటున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించి చాలా వరకూ టాకీ పార్ట్ పూర్తైంది.

గౌతమ్ తిన్ననూరి సినిమా షూటింగ్ జరుగుతుండగానే విజయ్ దేవరకొండ తన మరో ప్రాజెక్టును ఇటీవలే అనౌన్స్ చేశాడు. దీన్ని 'రాజా వారు రాణి గారు' ఫేం రవి కిరణ్ కోలా తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని రూరల్ యాక్షన్ డ్రామాగా తీస్తున్నట్లు రివీల్ చేసేశారు.
విజయ్ దేవరకొండ - రవి కిరణ్ కోలా కాంబినేషన్‌లో రాబోయే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక, ఈ మూవీ షూట్‌కు చాలా సమయం ఉండడంతో ఇప్పుడు నటీనటుల ఎంపిక ప్రక్రియ మొదలెట్టారు. ఇలా తాజాగా హీరోయిన్‌ను ఫైనల్ చేశారట.

విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా తెరకెక్కించే ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. రూరల్ బ్యాగ్‌డ్రాప్ మూవీ కావడంతోనే ఈ నేచురల్ బ్యూటీని తీసుకున్నారని అంటున్నారు. ఇందులో సాయి పల్లవి పాత్ర ఎంతో సహజసిద్ధంగా ఉండబోతుందని తెలిసింది. దీంతో ఈ జంటపై అప్పుడే హైప్ పెరిగిపోతోంది.
ఇదిలా ఉండగా.. విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పుడు శరవేగంగా సాగుతున్నట్లు తెలిసింది. ఇది పూర్తైన వెంటనే రెగ్యూలర్ షూటింగ్‌ను మొదలుపెడతారని తెలుస్తోంది. ఇందులో నటించే నటీనటులు, పని చేసే టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే రివీల్ చేయబోతున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











