For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sekhar Kammula విషయంలో నేను పొసెసివ్.. అలా చేస్తే కోపం... 'లవ్ స్టోరీ' సీక్రెట్!

  |

  చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెబుతూ ఉంటారు. కానీ యాక్టర్ అయ్యాక కూడా డాక్టర్ కోర్సు పూర్తి చేసిన సాయి పల్లవి ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉంది. అయితే దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ విషయంలో తాను చాలా పొసెసివ్ అని సాయి పల్లవి తాజాగా హాట్ కామెంట్స్ చేసింది.. ఆయన మీద చాలా త్వరగా తనకు కోపం వచ్చేస్తుంది అని ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.. ఆ వివరాల్లోకి వెళితే

  ప్రేమమ్ తో ఎంట్రీ

  ప్రేమమ్ తో ఎంట్రీ

  డాన్సర్గా టెలివిజన్ రంగంలో ముందు ప్రవేశించి ఆ తర్వాత పూర్తి స్థాయి హీరోయిన్ గా మారింది సాయి పల్లవి.. రెండు తమిళ సినిమాల్లో క్రెడిట్ దక్కని పాత్రలలో నటించిన ఈ భామ 2015 లో విడుదలైన ప్రేమమ్ అనే మళయాళ సినిమాలో మలర్ అనే లెక్చరర్ పాత్రలో నటించి కుర్రకారు అందరినీ కట్టిపడేసింది.. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు అన్ని బాషలలో వరుస అవకాశాలు వచ్చిపడ్డాయి. అయితే చాలా ఆచితూచి ఆమె సినిమాలు చేసింది.

  హైబ్రిడ్ పిల్ల

  హైబ్రిడ్ పిల్ల

  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో ఈ భామ తెలుగు తెరంగ్రేటం చేసింది. భానుమతి అనే పక్కా పల్లెటూరి తెలంగాణ యువతి పాత్రలో నటించి మెప్పించింది సాయి పల్లవి. భానుమతి, రెండు కులాలు రెండు మతాలు హైబ్రిడ్ పిల్ల అంటూ సాయి పల్లవి చెప్పిన డైలాగ్ ఇప్పటికీ జనాల నోట్లో నాతోనే ఉంటుంది. వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించిన ఈ భామ మంచి క్రేజ్ సంపాదించింది.

  ఏకంగా మూడు

  ఏకంగా మూడు

  ఆ తర్వాత తెలుగులో మిడిల్ క్లాస్ అబ్బాయి, పడి పడి లేచే మనసు సినిమాల్లో నటించిన సాయి పల్లవి మళ్లీ తెలుగులో సినిమా చేయడానికి దాదాపు రెండేళ్ల గ్యాప్ ఇచ్చింది. ఈ మధ్యలో వైద్య పరీక్షలు కూడా పూర్తి చేసుకున్న ఈ భామ ఇప్పుడు ఏకంగా తెలుగులో మూడు సినిమాలు చేస్తోంది. అందులో లవ్ స్టోరీ విరాటపర్వం సినిమాల షూటింగ్ పూర్తి కాగా నాని సరసన చేస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా దాదాపు పూర్తి కావచ్చింది.

  ఆసక్తికర కామెంట్స్

  ఆసక్తికర కామెంట్స్

  అయితే నాగ చైతన్య హీరోగా నటించిన లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ సినిమా యూనిట్ రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘నం.1 యారి'షో సీజన్ 3 లో పాల్గొంది. దీనికి సంబంధించిన తాజా ప్రోమోలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సాయిపల్లవి. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ విశేషాలు రానా అడగగా ఆసక్తికరంగా స్పందించింది ఆమె.

  ఆయన విషయంలో పొసెసివ్

  ఆయన విషయంలో పొసెసివ్

  అసలు శేఖర్ కమ్ముల సెట్ లో ఉండగా ఎలా ఉంటారు అనే దానిమీద రానా ప్రశ్నలు సంధించగా సాయి పల్లవి శేఖర్ కమల్ విషయంలో తాను పొసెసివ్ అని, సెట్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా చైతన్య నటనను చూసి ఆయన మెచ్చుకుంటే ఆయన వైపు కోపంగా చూస్తూ ఉంటానని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే తనకు సంబంధం లేని విషయాల్లో కూడా కల్పించుకుని శేఖర్ కి ఆయనకు సలహాలు ఇస్తూ ఉంటానని సాయిపల్లవి చెప్పుకొచ్చింది.

  AP : శభాష్ మగువా.. Sonu Sood కి పెన్షన్ విరాళమిచ్చిన యువతి!! || Filmibeat Telugu
  యాక్ అంటారట

  యాక్ అంటారట

  ఇక తను నేను ఎవ‌రిని ఎక్కువ పొగ‌డనని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు. 'గుడ్ అంటాను, న‌చ్చ‌క‌పోతే మానిట‌ర్ ముందు నుండి లేచి వెళ్లిపోతాను అని చెప్పుకొచ్చారు. అయితే మ‌ధ్య‌లో క‌ల్పించుకున్న చైతూ ‘దాదాపు గుడ్‌ అంటారు. ఈ మధ్య ‘యాక్‌'అనే పదం కూడా నేర్చుకున్నాడు' అని సెటైర్ వేశారు. దీనో రానా స్పందిస్తూ ‘యాక్‌' అనిపించుకునేంత దారుణంగా ఎప్పుడూ నేను చేయలేదన‌ని చెప్పుకొచ్చారు. వీరిద్దరూ కలిసి గతంలో లీడర్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.

  English summary
  Shekhar kamla made 'love story' starring sai pallavi and Naga Chaitanya. Recently the director with sai pallavi and Naga Chaitanya attended tocseason 3 show. While the host Rana asked about the movie shooting experiences sai pallavi made some interesting comments on director Sekhar kammula.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X