మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సాయి పల్లవి.. హీరోయిన్‌గా కాదట
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం గ్లామరస్ హీరోయిన్స్ మాత్రమే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు ఎక్కువగా అందుకుంటున్నారు. పూజా హెగ్డే రష్మీక మందన్న వంటి నటీమణులు సీనియర్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక మరోవైపు సాయి పల్లవి మాత్రం అంధరికంటే డిఫరెంట్ గా అడుగులు వేస్తోంది. ఏ మాత్రం లిమిట్స్ దాటకుండా ఒక పరిధిలో నటిస్తూ వెళుతోంది.
Recommended Video
ఇక నెక్స్ట్ ఈ కేరళ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి ప్రాజెక్టులో కూడా ఒక స్పెషల్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆ తరువాత బాబీ, మెహర్ రమేష్ సినిమాలను సెట్స్ పైకి తెనున్నాడు. ఇక మెహర్ రమేష్ తో చేయనున్న సినిమా తమిళ్ వేదళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

అయితే ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సోదరిగా సాయి పల్లవి నటించనుందట. తమిళ్ లో అజిత్ సోదరిగా లక్ష్మీ మీనన్ నటించింది. ఆ పాత్ర సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. ఇక తెలుగు రీమేక్ లో మెగాస్టార్ కి సిస్టర్ రోల్ అంటే అంచనాలకు తగ్గట్లుగా ఉండాలని సాయి పల్లవిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ అప్డేట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు సాయి పల్లవి నాగ చైతన్య 'లవ్ స్టొరీ' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే విరాట పర్వం అనే మరో డిఫరెంట్ సినిమాలో కూడా మెయిన్ లీడ్ లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











