సాయి పల్లవి బర్త్ డే స్పెషల్.. విరాటపర్వం పోస్టర్ వైరల్

సాయి పల్లవి పేరు తెలియన సినీ ప్రేక్షకులుండరు. చేసింది తక్కువ సినిమాలే అయినా సంపాదించుకున్న పేరు మాత్రం చాలా పెద్దది. వెండితెరపై కనబడింది తక్కువ సార్లే అయినా.. కట్టిపడేయగల ప్రతిభ సాయి పల్లవి సొంతం. అందం, ప్రతిభ, అదృష్టం అన్నీ ఉన్న సాయి పల్లవి సినీ ప్రేక్షకులను ఫిదా చేసింది. సౌత్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. మలయాళ చిత్రం ప్రేమమ్‌తో వెండితెరకు పరిచయం అయింది.

తెలుగు నాట ఫిదా, ఎంసీఏ, పడి పడి లేచే మనసు, కణం వంటి చిత్రాల్లో నటించి అందర్నీ ఆకట్టుకుంది. ఇక రౌడీ బేబీ అంటూ సాయి పల్లవి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆమె డ్యాన్సులకు యూట్యూబ్ బద్దలైంది. అటువంటి సాయిపల్లవి ఓ ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమైంది.

Sai Pallavi Look From Virata Parvam On Her Birthday

నీదీ నాదీ ఒకే కథ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన వేణు ఊడుగుల.. తన తదుపరి చిత్రాన్ని అదే రీతిలో మలుచుతున్నాడు. 1992 నేపథ్యంలో జరిగిన కథ ఆధారంగా విరాట పర్వం అనే సినిమాను రానా, సాయి పల్లవి వంటి ప్రతిభావంతులతో తీస్తున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది.

ఈ మేరకు డైరెక్టర్ ఆ పోస్టర్‌ను విశ్లేషించిన తీరు ఆకట్టుకుంటోంది. 'అడవి మార్గాన ఉన్న ఆ అమరవీరుల స్తూపం దగ్గరే ఆమె ఎందుకు ఒంటరిగా కూర్చుంది?ఎవరి కోసం ఆమె నిరీక్షణ ?ఆమె ఒడిలోని డైరీలో రాసి ఉన్నఅక్షరాలేమిటి?ఆమె పక్కనున్న బ్యాగ్ లో ఉన్నవేమిటి?ఈ ప్రశ్నలకు జవాబులు విడుదల తర్వాతే' అంటూ మరింత ఆసక్తిని రేకెత్తించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X