సాయిపల్లవితో అవి చాలా కష్టం .. టాలీవుడ్ స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతం అక్కినేని వారి ఇంట ఓ శుభకార్యంతో మొత్తం పండుగ వాతావరణంలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కినేని నాగ చైతన్య అలాగే శోభిత ధూళిపాళ పెళ్లితో కుటుంబమంతా సందడిగా ఉంది. తన మాజీ భార్య ప్రముఖ హీరోయిన్ సమంతకి విడాకులు ఇచ్చిన తర్వాత ఇన్నేళ్లకి లైఫ్ లో అక్కినేని నాగ చైతన్య కొత్త స్టెప్ తీసుకునేసరికి అక్కినేని ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇపుడు నాగ చైతన్య చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో కార్తికేయ 2 సెన్సేషన్ దర్శకుడు చందూ మొండేటితో చేస్తున్న తండేల్ కూడా ఒకటి. ఈ చిత్రంలో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవితో నాగ చైతన్య కెరీర్‌లో రెండో సారి వర్క్ చేస్తుండగా తమ మొదటి చిత్రం "లవ్ స్టోరీ" కి మంచి మార్కులు అందుకొని వీరి జంట సూపర్ హిట్ అయ్యింది.

కాగా ఇపుడు తండేల్ లో కూడా ఇద్దరూ అదే మ్యాజిక్ చేస్తున్నట్టుగా కూడా రీసెంట్ బుజ్జితల్లి సాంగ్ వింటే అర్ధం అయ్యిపోయింది. మరి ఆన్ స్క్రీన్ పై మంచి కెమిస్ట్రీ ఉన్న ఈ యువ జంట లేటెస్ట్ గా పరస్పరం చేసుకున్న కామెంట్స్ ఇపుడు బయటకి వచ్చాయి. నాగ చైతన్య తన కుటుంబీకుడు రానా దగ్గుబాటి ఓటిటి టాక్ షోలో ముఖ్య అతిధిగా హాజరైన తాజా ఎపిసోడ్ ఇపుడు స్ట్రీమింగ్ కి వచ్చింది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ ఎపిసోడ్ లో సాయి పల్లవితో వర్క్‌పై నాగచైతన్య హాట్ కామెంట్స్ చేసాడు. ఆమెతో డాన్స్ చెయ్యాలన్నా .. యాక్ట్ చెయ్యాలన్నా ఒక టెన్షన్ వచ్చేస్తుంది అని చెప్పుకొచ్చాడు. సాయి పల్లవి చాలా టాలెంటెడ్, తనకి గ్రేట్ కో స్టార్ అంటూ ఆమెపై ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఇవి కాకుండా సాయి పల్లవి కూడా చైతుపై ఓ స్టేట్మెంట్ ఇచ్చింది.

చైతు అంటే ఓ విషయంలో చిరాకని మొహం మీదే చెప్పేయడంతో నాగ చైతన్య కూడా ఒక్క క్షణం అలా ఒక్క క్షణం షాక్ అయ్యాడు. ఇంతకీ ఆమెకి అతడంటే ఎందుకు చిరాకు అంటూ సెట్స్ లో కానీ షూటింగ్ లో కానీ ఏదన్నా నచ్చకపోతే ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతాడట. అలా చేస్తే తనకు చిరాకు వచ్చేస్తుంది అని ఆమె చెప్తూ నవ్వేసింది.
దీనితో వీరి కామెంట్స్ వీరి అభిమానుల్లో వైరల్ గా మారాయి. ఇక వీరి కలయికలో వస్తున్న భారీ చిత్రం తండేల్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతుండగా రీసెంట్ గానే సాయి పల్లవి తమిళ్ లో అమరన్ అనే భారీ హిట్ కొట్టి కోలీవుడ్ లో సెన్సేషన్ సెట్ చేసింది. ఇక తండేల్ కాకుండా హిందీలో భారీ ప్రాజెక్ట్ రామాయణ కూడా ఆమె చేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











