విడుదలకు ముందే 16కోట్ల లాభం.. సాయి పల్లవి రేంజ్ మామూలుగా లేదు!
థియేటర్స్ ఓపెన్ కావడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఓకేవేళ ఓపెన్ అయినా కూడా పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేము. ఇక సినిమా థియేటర్స్ మునుపటి రోజుల్లా హౌజ్ ఫుల్ బోర్డులతో దర్శనం ఇవ్వడం అనేది సందేహంగానే ఉంది. ఇకపోతే త్వరలో రానున్న లవ్ స్టోరీ సినిమాకు విడుదలకు ముందే మంచి లాభాలు అందినట్లు తెలుస్తోంది.
Recommended Video

అప్పుడే రావాల్సింది..
నాగ చైతన్య , సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. అసలైతే ఈ సినిమా సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఊహించని విదంగా కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడక తప్పలేదు. సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. సాయి పల్లవి కారణంగా ఈ సినిమాకి క్రేజ్ కూడా పెరుగుతోంది.

విడుదలకు ముందే..
ఇకపోతే ఈ సినిమాకు కాంబినేషన్ ఒక్కటే మంచి హైప్ క్రియేట్ చేస్తోందని చెప్పాలి. ఫిదా లాంటి బాక్సాఫీస్ హిట్ సినిమా తరువాత శేఖర్ కమ్ముల సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం.. అలాగే లవర్ బాయ్ నాగ చైతన్య ఈ సినిమాలో నటిస్తుండడంతో అంచనాల డోస్ పెరిగింది. సినిమా ఎప్పుడు వస్తుందా అని ఓ వర్గం ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే చెప్పాలి.

బెస్ట్ డీల్..
ప్రస్తుత రోజుల్లో ఒక సినిమా విడుదలకు ముందే జనాల్లో మంచి హైప్ క్రియేట్ చేయగలిగితే దాదాపు ఆ సినిమా కాస్త ప్రాఫిట్ జోన్ లోకి వచ్చినట్లే.. లవ్ స్టోరీ సినిమా కూడా శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ రైట్స్ తో మంచి డీల్స్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా నాన్ తియేట్రికల్ రైట్స్ ద్వారా సినిమకు మొత్తంగా 16కోట్ల రూపాయల వరకు అందినట్లు తెలుస్తోంది.

రిలీజ్ ఎప్పుడంటే..
ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే డిజిటల్ రైట్స్ ని అల్లు అరవింద్ ఆహా యాప్ కోసం దక్కించుకోగా.. శాటిలైట్ హక్కుల్ని స్టార్ మా అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాను పరిస్థితులను బట్టి ఆగస్టులో రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది.


Click it and Unblock the Notifications











