స్టార్ హీరో బిగ్ బడ్జెట్ మూవీ.. మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన సాయి పల్లవి

ప్రస్తుతం హీరోయిన్స్ కొరత ఉన్నప్పటికీ స్టార్ హీరోల సినిమాల్లో మిడియామ్ రేంజ్ హీరోయిన్స్ అవకాశాలు అందుకోలేకపోతున్నారు. ఎక్కువగా రష్మీక మందన్న, పూజా హగ్డే వంటి స్టార్ హీరోయిన్స్ మధ్య పోటీ తీవ్రంగా పెరిగింది. అయితే అలాంటి వాళ్లకు సాయి పల్లవి లాంటి బ్యూటీ అప్పుడప్పుడు పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ కేరళ కుట్టి కేవలం తనకు నచ్చిన సినిమాలే చేస్తోంది.

నచ్చకపోతే మాత్రం ఎలాంటి హీరోలనైనా రిజెక్ట్ చేయడంలో ఈ బ్యూటీ ముందుంటుంది. ఇక త్వరలో తమిళ్ హీరో విక్రమ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ ఉందట. విక్రమ్ చాలా రోజుల తరువాత తన మార్కెట్ ని మించి కెరీర్ లో ఒక బిగ్ బడ్జెట్ సినిమాను చేయబోతున్నాడు. నాన్న దర్శకుడు విజయ్ తెరకెక్కించబోతున్న ఒక సినిమా బిగ్ బడ్జెట్ లో రూపొందనుందట.

Sai pallavi next movie with kollywood star hero vikram

అయితే ఆ సినిమాలో విక్రమ్ కి జోడిగా సాయి పల్లవి నటించబోతోందట. సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అవసరం ఉండగా సాయి పల్లవిని ఒక పాత్రకి ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ఇక మరో హీరోయిన్ గా ఎవరు సెలెక్ట్ అవుతారనేది చూడాలి. నెక్స్ట్ సాయి పల్లవి కొన్ని డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగ చైతన్యతో నటించిన లవ్ స్టోరీ సినిమా రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X