twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    1970 నాటి రియల్ సంఘటనలతో... సాయి పల్లవి సైకలాజికల్ థ్రిల్లర్!

    |

    'ఫిదా' సినిమా తర్వాత సాయి పల్లవి తెలుగు వారికి ఇష్టమైన నటిగా మారిపోయింది. తొలి సినిమాకే సొంతగా డబ్బింగ్ చెప్పిన ఈ తమిళ బ్యూటీ టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆమె సినిమాలకు ఇక్కడ మంచి మార్కెట్ ఏర్పడేలా చేసుకుంది. ఈ నేపథ్యంలో సాయి పల్లవి ఇతర భాషల్లో చేసిన చిత్రాలను తెలుగులో విడుదల చేసేందుకు పలువురు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.

    తాజాగా సాయి పల్లవి నటించిన మలయాళ మూవీ 'అథిరన్' తెలుగులో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత అన్నంరెడ్డి కృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారు. ప్రస్తుతం తెలుగు అనువాద పనులు జరుగుతున్నాయి.

    Sai Pallavis Athiran to release in Telugu

    ఇందులో సాయి పల్లవి, ఫహాద్ పాజిల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వివేక్ దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో నిర్మాతలు ఉన్నారు.

    Sai Pallavis Athiran to release in Telugu

    కేరళలో 1970 ప్రాంతంలో జరిగిన కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి తెలుగు ప్రేక్షుకులకు సుపరిచితులే. ఘిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఆగస్టు చివరి వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ ప్రారంభించబోతున్నారు.

    Sai Pallavis Athiran to release in Telugu

    డైలాగ్స్: ఎం రాజశేఖర్ రెడ్డి
    లిరిక్స్: చరణ్ అర్జున్, మధు మామిడి
    ఎడిటింగ్: అయూబ్ ఖాన్
    సినిమాటోగ్రఫీ: అను మోతేదత్
    స్క్రీన్ ప్లే: పిఎఫ్ మాథ్యూస్
    సంగీతం: పిఎస్ జయహరి
    దర్శకత్వం: వివేక్
    నిర్మాతలు: ఎకె కుమార్, జి రవి కుమార్

    English summary
    Sai Pallavi's Malayalam-language thriller 'Athiran' is being dubbed in Telugu. Well-known producer Annamreddy Krishna kumar is bringing the film to the Teluguaudience. Renji Panicker, Leona Lishoy, Shanti Krishna and others are part of the cast.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X