Oscar నామినేషన్‌కు శ్యామ్ సింగరాయ్.. సాయిపల్లవి కెరీర్‌లో మరో ఘనత
నేచురల్ స్టార్ నాని, సాయిపల్లవి జంటగా కృతిశెట్టి కీలక పాత్రలో నటించిన శ్యామ్ సింగరాయ్ ప్రపంచవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. థియేట్రికల్ రిలీజ్ ద్వారా సినీ విమర్శకులు, సగటు ప్రేక్షకులను ఆకట్టుకొన్న ఈ చిత్రం మరో సంచలనానికి తెర తీయబోతున్నది. ఈ చిత్రాన్ని ఆస్కార్ అవార్డుల నామినేషన్ కోసం పంపడం భారీ చర్చకు దారి తీసింది. రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సత్యదేవ్ జంగ కథను అందించారు. డిసెంబర్ 24వ తేదీన రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఆస్కార్ నామినేషన్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే.
నిహారిక ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై రూపొందిన శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని మూడు క్యాటగిరీల కోసం ఆస్కార్ నామినేషన్‌కు పంపారు. పిరియాడిక్ ఫిలిం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, క్లాసికల్ డ్యానస్ ఇండీ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్‌కు నిర్మాత వెంకట్ బోయనపల్లి పంపారు. ఈ సినిమాకు మికీ జే మేయర్ అద్భుతమైన, ఫీల్ గుడ్ సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే.

దేవదాసి కథా నేపథ్యంగా పిరియాడిక్ ఫిల్మ్‌గా రూపొందిన శ్యామ్ సింగరాయ్ చిత్రంలో దేవదాసీగా సాయి పల్లవి, విప్లవా భావాలు కలిగిన రచయితగా, అలాగే ఫిల్మ్ మేకర్‌గా నాని ద్విపాత్రాభినయం చేశారు.
శ్యామ్ సింగరాయ్ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో బ్రహ్మండమైన ఆదరణను మూటగట్టుకొన్నది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో 10 వారాల పాటు టాప్ ట్రెండింగ్‌గా నిలిచింది.
తాజాగా ఈ సినిమాను ఆస్కార్ నామినేట్ చేయడంతో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ సినిమా ఆస్కార్ సాధించి భారతీయ సినిమా పరిశ్రమకు ఖ్యాతిని తెచ్చిపెడుతుందా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











