సాయి పల్లవిని ముద్దులతో ముంచెత్తకు..హీరోను వేడుకుంటున్న ఫ్యాన్స్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అతని మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు ప్రతి సినిమాలో లిప్ లాక్ కంపల్సరీ. ఈ మధ్య వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమాలో కూడా మృణాల్ ఠాకూర్ తో పెదవిని పంచుకున్నాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. నిజం చెప్పాలంటే.. లైగర్ తరువాత నుంచి విజయ్ కు బ్యాడ్ లక్ నడుస్తుందనే చెప్పాలి.

అర్జున్ రెడ్డి సినిమా తరువాత ఉన్నంత జోష్.. లైగర్ తరువాత విజయ్ కు లేదు. వరుస సినిమాలను తీస్తున్నాడేకానీ హిట్ అందుకోవడం లేదు. ఇప్పుడు కూడా విజయ్ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి . VD 12 షూటింగ్ లో ఉండగా.. టాక్సీవాలా కాంబో మళ్లీ రిపీట్ చేస్తున్నారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ రెండు కాకుండా విజయ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Sai Pallavi to play female lead in Vijay Deverakonda s next

రాజావారు రాణిగారు సినిమాతో ప్యూర్ లవ్ స్టోరీని అందించిన దర్శకుడు రవికిరణ్ కోలా.. ఎప్పటినుంచొ విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయడానికి ప్లాన్స్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ మధ్యనే ఆయన కథ నచ్చి విజయ్ సైతం ఓకే చెప్పాడట. ఇక రేపో మాపో ఈ సినిమా కూడా అధికారికం కానుంది. అది కూడా దిల్ రాజు బ్యానర్ లో.. ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ లోనే దిల్ రాజు.. విజయ్ తో మరో సినిమా ఉండబోతుందని తెలిపాడు . ఆ సినిమా ఇదే అని తెలుస్తోంది.

ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ్ సరసన నటించడానికి లేడీ పవర్ స్టార్ సాయిపల్లవిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట మేకర్స్. పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్ప సాయిపల్లవి కథకు ఓకే చెప్పదు. ఒకవేళ ఓకే చెప్పినా.. ఆ సినిమాలో గ్లామర్ ఒలకబోయాలి.. ముద్దులు పెట్టాలి అంటే ససేమిరా ఒప్పుకోదు.

Sai Pallavi to play female lead in Vijay Deverakonda s next

ఎంత డబ్బు ఇస్తామన్నా.. ఎంత పెద్ద హీరో అయినా కూడా ఈ చిన్నది నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంది. అలాంటింది రౌడీ హీరో సినిమా అంటే.. ముద్దు లేకండా సినిమా కంప్లీట్ అవ్వదు. మరి ఈ సినిమాకు సాయిపల్లవిని ఎలా ఒప్పించాలని మేకర్స్ అనుకున్నారో అనేది తెలియదు కానీ, ఈ వార్త విన్నాక అభిమానులు మాత్రం.. అయ్య అయ్యా సాయి పల్లవిని మాత్రం వదిలేయ్ అయ్యా.. ఇండస్ట్రీలో ఇప్పటివరకు కొంచెం విలువలతో ఉన్న హీరోయిన్ అంటే ఆమె.. అని చెప్పుకొస్తున్నారు.

మరి సాయిపల్లవి ఈ సినిమాను ఒప్పుకుంటుందో లేదో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం సాయిపల్లవి అన్ని భాషల్లో ఒక్కో సినిమా చేస్తూ వస్తుంది. తెలుగులో తండేల్, తమిళ్ లో అమరన్, హిందీలో రామాయణ సినిమాల్లో నటిస్తుంది. మరి ఈ సినిమాలతో సాయిపల్లవి ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X