అక్కినేని హీరోతో సాయి పల్లవి.. శేఖర్ కమ్ముల ఎంటరై..!

అక్కినేని వారసుడు నాగ చైతన్యతో కలిసి చిందులేసే అవకాశాన్ని పెట్టేసింది ఫిదా బీటీ సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించబోతున్నారనే వార్త ఫిలిం నగర్ సర్కిల్స్ తెగ చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు శేఖర్ కమ్ముల ఈ ఇద్దరినీ సంప్రదించడం, వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగాయని తెలుస్తోంది.

సాధారణం గానే శేఖర్ కమ్ములది డిఫెరెంట్ వే. కమర్షియల్ హంగులు, భారీ యాక్షన్ సీన్లు, పెద్ద హీరోల జోలికి పోకుండా తనదైన శైలిలో అలరించడం ఆయనకు మాత్రమే సాటి. తనకు డైరెక్టర్ గా భారీ ఫెయిత్ వచ్చినప్పటికీ స్టార్‌ హీరోల వెంట పడకుండా తన కథకు ఎవరు బాగుంటారో, వాళ్లనే ఎంచుకుంటూ సినిమాలు రూపొందిస్తుంటారు శేఖర్ కమ్ముల. వీలైనంత వరకూ కొత్త వారికే ఆయన ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో శేఖర్ వద్ద ఉన్న ఓ కథకు నాగచైతన్య, సాయి పల్లవి కరెక్ట్ గా సూట్ అవుతారని భావించిన ఆయన.. వీరితో కొత్త సినిమా రూపొందించేందుకు రెడీ అయ్యారట.

Sai Pallavi to Romance With Naga Chaitanya

అత్యంత సాధారణంగా సాగే కథలో ఊహించని మలుపులు ఉండేలా చూసుకుంటూ ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ కి దగ్గరయ్యేలా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట శేఖర్ కమ్ముల. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించడానికి రెడీగా ఉన్నారట. అంతా ఓకే అయితే ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న తదుపరి సినిమా ఇదే అవుతుంది.

మరోవైపు నాగచైతన్య వెంకీమామ తో బిజీగా ఉన్నాడు. రియల్ లైఫ్ మామతో రీల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు చైతూ. తండ్రితో కలిసి 'బంగార్రాజు' కూడా చేస్తున్నాడు. అలాగే సాయి పల్లవి కూడా తన సినిమాలతో బిజీగా ఉంది. వీరిద్దరూ ఫ్రీ కాగానే శేఖర్ కమ్ముల సెట్స్ పైకి రానున్నారనేది తాజా సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X