దర్శకుడు ఆ మాట అనగానే ఇంటికెళ్లి మా అమ్మకు చెప్పి ఏడ్చా: సాయి పల్లవి

Recommended Video

Sai Pallavi Shares Her Bad Experience In A Movie Shoot || Filmibeat Telugu

ప్రేమమ్ బ్యూటీ సాయి పల్లవి అంటే తెలియని వారుండరు. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టిన ఈ భామ ఆ తరువాత తెలుగులో ఫిదా సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌ని ఫిదా చేసేసింది. ఎప్పుడూ ముద్దు ముద్దు మాటలతో చలాకీగా ఈ హైబ్రీడ్ పిల్లకు ఓ సందర్భం ఏడుపు తీసుకొచ్చిందట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా పేర్కొంటూ తన బాధను పంచుకుంది.

తమిళ అగ్ర నటుడు సూర్య హీరోగా నటించిన 'ఎన్జీకే' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది సాయి పల్లవి. ఈ సినిమాలో సూర్య భార్యగా సాయి పల్లవి కనిపించనుంది. చిత్రంలో మరో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ యాక్ట్ చేసింది. సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మే 31 తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. దీంతో సినిమాకు సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు యూనిట్ సభ్యులు. ఇందులో భాగంగా మీడియాతో ముచ్చటించిన సాయి పల్లవి.. ఓ సన్నివేశంలో తను యాక్టింగ్ దర్శకుడికి నచ్చక పోవడంతో చాలా సేపు బాధపడ్డానని పేర్కొంది.

Sai Pallavi told her bad experirence

''ఎన్జీకే సినిమాలోని ఓ సీన్ లో నా యాక్టింగ్‌తో దర్శకుడు సెల్వరాఘవన్‌ను మెప్పించలేకపోయాను. దీంతో ఆయన షూట్‌ను తర్వాతి రోజుకు వాయిదా వేయడం జరిగింది. నాకు చాలా బాధ కలిగింది. వెంటనే ఇంటికి వెళ్లి మా అమ్మకు విషయం చెప్పి ఏడ్చేశాను. అంతేకాదు దర్శకుడికి నేను చేసిన సీన్ నచ్చలేదంటే నా నటనలో ఏదో లోపం ఉందని భావించా. కానీ ఆ తర్వాతి రోజు నేను తొలి షాట్‌ కే డైరెక్టర్ ఓకే చెప్పాడు. దీంతో హీరో సూర్య దగ్గరకెళ్ళి ఈ రీటేక్స్ గురించి అడిగా. సెల్వరాఘవన్ నాకు కూడా ఎపుడు సింగిల్ టేక్‌కి ఓకే చెప్పలేదని సూర్య నాతో చెప్పారు. ఆయనకు కూడా చాలా టేకులు తీసుకుంటారని తెలిసిన తర్వాత నేను బాగా రిలాక్స్ అయ్యా'' అని చెప్పింది సాయి పల్లవి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X