తప్పనిసరి పరిస్థితుల్లో క్షమాపణలు చెప్పిన సాయి పల్లవి.. వివరణ కూడా ఇచ్చుకుంది

సాధరణంగా ఏ మనిషికైనా కొన్ని అనుకోని పరిస్థితులు లేనిపోని తలనొప్పులు తెస్తుంటాయి. సెలెబ్రిటీలు, హీరోయిన్లకైతే ఇది మరీ ఎక్కవ. ప్రతీ క్షణం వారి వారి కదలికలను పరిశీలించే మీడియా, దానికి తోడు సోషల్ మీడియా అదును దొరికితే చాలు బుక్ చేసేస్తుంటాయి. కాబట్టి నెటిజన్లతో, మీడియాతో సీలెబ్రిటీలు చాలా జాగ్రత్తగా మెదులుతుంటారు. కానీ ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో అనుకున్నవి సాధ్యపడకపోవచ్చు. తాజాగా సాయి పల్లవికి అదే జరిగింది. కేవలం చాటింగ్ విషయంలో నెటిజన్లకు సంజాయిషీ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆమెకు ఎదురైంది.

ఆమె నటించిన తాజా సినిమా 'ఎన్జీకే' చిత్ర ప్రమోషన్ లో భాగంగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేద్దామని అనుకుంది సాయి పల్లవి. సినిమాల విడుదల సమయంలో ఇలా హీరో హీరోయిన్స్ చిట్ చాట్స్ లో పాల్గొనడం సహజమే. ఈ చిట్ చాట్స్ ద్వారా సినిమాకు సంబంధించిన విషయాలు చెబుతూ, సినిమా షూటింగ్, పాత్రలకు సంబందించిన పలు విషయాల గురించి అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటారు సదరు హీరో హీరోయిన్స్. ఈ కోవలోనే నెటిజన్లతో చిట్ చాట్ చేస్తానని ఓ టైమ్ ఫిక్స్ చేసిన సాయి పల్లవి.. అనుకోని కారణాల వల్ల ఆ చాట్ లో పాల్గొనలేక పోయింది.

Sai Pallavi trolled by netijans because of chit chat

ఎంతో ఆసక్తిగా సాయి పల్లవితో చాట్ చేయాలని ఆ టైమ్ కి అందుబాటులోకి వచ్చిన నెటిజన్లు సాయి పల్లవిపై ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ సాయి పల్లవి హ్యాండ్ ఇవ్వడంతో నెటిజన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా సమయం వృదా చేసుకుని నీతో లైవ్ చాట్ పై ఆసక్తిగా ఎదురు చూస్తుంటే నువ్వు చాటింగ్ కు రాకుండా చీటింగ్ చేశావంటూ ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో విమర్శలు ఎక్కువవుతున్నాయని గమనించిన సాయి పల్లవి తప్పనిసరి పరిస్థితుల్లో క్షమాపణలు చెప్పేసింది. మరోసారి ఎప్పుడైనా సోషల్ మీడియాలో కలుద్దాం అని వివరణ కూడా ఇచ్చింది. ఈ ఉదంతం సెలెబ్రెటీలకు ఓ కొత్త సోషల్ మీడియా పాఠమే కదండీ!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X