సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్.. లవ్ స్టోరి మూవీ రిలీజ్ వాయిదా
ప్రమాదకరమైన కరోనావైరస్ దెబ్బకు టాలీవుడ్ విలవిలలాడే పరిస్థితి కనిపిస్తున్నది. ఇప్పటికే ఆచార్య సినిమా రిలీజ్ వాయిదా పడినట్టు వార్తలు వస్తుండగా తాజాగా మరో సినిమా ఆ జాబితాలో చేరింది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవి, నాగచైతన్య నటించిన లవ్ స్టోరి చిత్రాన్ని వాస్తవంగా ఏప్రిల్ 16వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించారు. గత రెండు వారాలుగా కరోనావైరస్ వ్యాప్తి ఊహించని విధంగా మారిపోవడంతో టాలీవుడ్ పరిశ్రమ ఆందోళనకు గురి అవుతున్నది. ఇప్పటికే నివేదా థామస్, అంజలి, అల్లు అరవింద్ లాంటి సినీ ప్రముఖులకు పాజిటివ్ రావడంతో అందరిలోనూ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తమైంది.

ఇలాంటి పరిస్థితుల్లో లవ్ స్టోరి సినిమా విడుదలను వాయిదా వేయాలని చిత్ర నిర్మాతలు నిర్ణయం తీసుకొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 50 శాతం కెపాసిటీని తెలుగు రాష్ట్రాల్లో విధించే అవకాశం ఉండటంతో సినిమాను కొద్ది నెలలు వాయిదా వేయాలని నిర్మాతలు పుష్కర్ రామ్మోహన్ రావు, నారాయణదాస్ నారంగ్ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిసింది.
దీంతో సాయిపల్లవి, అక్కినేని అభిమానులు షాక్ గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమాలోని సారంగ ధరియా, ఇతర పాటలు ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురిచేశాయి. ఈ క్రమంలో ఈ సినిమాను ఎప్పుడెప్పుడూ చూడాలనే కుతూహలంతో ఉన్న అభిమానులకు షాక్ తగిలే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











