ఊహించిన దాని కంటే ఎక్కువగా.. బెల్లంకొండ వారబ్బాయికి ఈ సారి పక్కానా?

'అల్లుడు శీను' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు బెల్లంకొండ వారి అబ్బాయి సాయి శ్రీనివాస్. ఈ సినిమా ఆశించినంత ఆడకపోయినా పర్వాలేదనిపించింది. ఇక, దీని తర్వావ ఎన్నో సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేశాడు. అయితే, అవేవీ అతడికి హిట్‌ను అందించలేకపోయాయి. కానీ, వీటిన్నింటిలో కొంతలో కొంత బోయపాటి డైరెక్షన్‌లో వచ్చిన 'జయ జానకి నాయక' మాత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఇటీవల తేజ దర్శకత్వంలో వచ్చిన 'సీత' కూడా నిరాశ పరచడంతో ఈ సారి సరికొత్తగా వస్తున్నాడు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా నటించిన చిత్రం 'రాక్షసుడు'. త‌మిళంలో సూప‌ర్‌ డూప‌ర్‌ హిట్ అయిన 'రాచ్చసన్' చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేశారు. ఈ చిత్రాన్ని ర‌మేష్‌ వ‌ర్మ డైరెక్ట్ చేశారు. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ సంభాషణలు అందించాడు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్ అంచనాలను అమాంతం పెంచేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

Sai Srinivas Bellamkonda Rakshasudu Trailer Released

ఇందులో బెల్లంకొండను సరికొత్తగా చూపించారు. అయితే, అతడి గత చిత్రాల మాదిరి భారీ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు లేకుండా కథా ప్రాధాన్యంగా ట్రైలర్‌ను కట్ చేశారు. సైకో మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ ఇంట్రస్టింగ్‌గా ఉంది. ఒకపక్క హర్రర్‌ సినిమాగా కనిపిస్తూనే.. మరోపక్క సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉంది. దీంతో ఈ ట్రైలర్‌పై మంచి స్పందనే వస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఈ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి.

వాస్తవానికి ఈ సినిమా జూలై 18న విడుదల కావాల్సింది. కానీ, ప్రపంచకప్ నేపత్యంలో 'ఇస్మార్ట్ శంకర్' వెనక్కి జరగడంతో, దీనిని కూడా వాయిదా వేశారు. దీంతో ఈ సినిమా ఆగస్టు 2 ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X