సింపుల్‌గా చెప్పాలంటే వాడొక సైకో.. రాక్షసుడు
మూస సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఈ మధ్యకాలంలో డిఫెరెంట్ కథాంశాలను ఎంచుకొని సినిమాలు రూపొందిస్తున్నారు దర్శక నిర్మాతలు. మరోవైపు అది రొమాంటిక్ మూవీ అయినా, యాక్షన్ మూవీ అయినా, హారర్ థ్రిల్లర్ అయినా అందులో ఏం కొత్తదనం ఉందనే వెతుకుతున్నారు ప్రేక్షకులు. టీజర్, ట్రైలర్ ద్వారా ఏమైనా కొత్తగా ఫీల్ కలిగితేనే ఆ సినిమా గురించి ఆలోచించేది లేదంటే స్కిప్.. అన్నట్లుగా ఉంది ప్రేక్షకుల ధోరణి. ఈ పాయింట్ గట్టిగా నమ్మిన రాక్షసుడు చిత్రయూనిట్ ఓ డిఫెరెంట్ టీజర్ రిలీజ్ చేసి ప్రేక్షకుల దృష్టి తమ సినిమాపై పడేలా చేసింది.
ఎ హవీష్ లక్ష్మణ్ కొనేరు ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ మూవీ 'రాక్షసుడు'. ఈ చిత్రానికి రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వం వహిస్తుండగా.. కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ ప్రమేశ్వరన్ జోడీ కట్టారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలతో బిజీగా ఉన్న చిత్రయూనిట్ తాజాగా టీజర్ రిలీజ్ చేసింది.

కేవలం 50 సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్‌లో పలు ఆసక్తికర సన్నివేశాలు చూపించి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. ''దిస్ మ్యాన్ సఫరింగ్ ఫ్రమ్ యాంటీ సోషల్ డిజార్డర్.. సింపుల్‌గా చెప్పాలంటే వాడొక సైకో.. వాడికి నొప్పంటో ఏంటో తెలియదనుకుంటా...రాక్షసుడు'' అని యాక్టర్ సూర్య చెప్పే డైలాగ్ మినహాయిస్తే ఎలాంటి డైలాగ్ లేకుండా కేవలం థ్రిల్లింగ్ సన్నివేశాలతో ఈ టీజర్ కట్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, సీనియర్ నటుడు సూర్య, ఓ చిన్నపాప వీరే టీజర్‌లో కనిపిస్తున్న పాత్రలు. ఫస్ట్ లుక్ తోనే సినిమాలో డిఫరెంట్ యాంగిల్ ఉందని పరిచయం చేసిన రాక్షసుడు యూనిట్.. ఈ టీజర్ తో సినిమాపై ఆసక్తి క్రియేట్ చేసింది.
చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. పాత్ర నిడివి ఎలా ఉంటుంది అనేది పక్కన బెడితే ఆయన సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ డైలాగ్ రైటర్ గా పరిచయం అవుతుండటం ఈ సినిమాకు సంబంధించి గమనించాల్సిన అంశం. జులై 18న 'రాక్షసుడు' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.


Click it and Unblock the Notifications











