బాల మహానటి ప్రధాన పాత్రలో ‘సిరి వెన్నెల’
'మహానటి' చిత్రంలో బాల సావిత్రిగా అందరినీ మెప్పించిన సాయి తేజస్విని ప్రధాన పాత్రలో 'సిరివెన్నెల' అనే చిత్రం రాబోతోంది. ఏఎన్‌బి కోర్డినేటర్స్, శాంతి టెలీఫిలిమ్స్ బ్యానర్‌పై కమల్ బోరా, ఏ ఎన్ భాషా, రామ సీత నిర్మాతలుగా ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
బాలనటి సాయి తేజస్విని మెయిన్ రోల్ చేస్తుండగా.. ప్రియమణి ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. తాజాగా సాయి తేజస్విని లుక్ విడుదల చేశారు. ఈ చిత్రంలో కాలకేయ ప్రభాకర్, సీనియర్ నటుడు అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. సాయి తేజస్విని పాత్ర చుట్టూ 'సిరివెన్నల' రూపుదిద్దుకుంది. ప్రియమణి గ్లామర్, నటన మా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని తెలిపారు.

సాంకేతిక వర్గం
నిర్మాతలు - కమల్ బోరా, ఏ.ఎన్. భాషా, ఏ.రామసీతా
రచన, దర్శకత్వం - ప్రకాష్ పులిజాల
మ్యూజిక్ - ఏఎన్ బి కోర్డినేటర్స్ మ్యూజిక్ ప్రొడక్షన్ కంపెనీ
సాంగ్స్ కంపోజింగ్ - మంత్ర ఆనంద్, కమ్రాన్
డిఓపి - కళ్యాణ్ సమి
ఎడిటర్ - నాగేశ్వర్ రెడ్డి
లిరిక్స్ - శ్రీరామ్ తపశ్వీ
కొరియోగ్రాఫర్ - ఛార్లీ
ఫైట్స్ - రామకృష్ణ
ప్రొడక్షన్ కంట్రోలర్ - యోగానంద్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - మోహన్ పరుచూరి.


Click it and Unblock the Notifications











