‘గని’ సెట్స్‌లో హీరోయిన్ హల్‌చల్: 7 గంటల పని 30 సెకెండ్లలోనే అని పోస్ట్
మెగా ప్రిన్స్ వరుణ్ నటిస్తోన్న తాజా చిత్రం 'గని'. కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. బాక్సింగ్ నేపథ్యంతో రూపొందుతోన్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫిల్మ్ స్టూడియోలో జరుగుతోంది. ఇందులో హీరో, హీరోయిన్లు, మిగిలిన నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరో రెండు వారాల పాటు ఉండే ఈ షెడ్యూల్‌లో క్లైమాక్స్ ఫైట్ సీన్‌ను కూడా షూట్ చేయబోతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర హీరోయిన్ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
'గని' మూవీలో వరుణ్ తేజ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లో ఎదుగుతోన్న ఈ ముద్దుగుమ్మ.. ఈ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగు పెట్టబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈమె 'గని' సెట్స్‌లో షూట్ చేసిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె కారులో నుంచి దిగేటప్పటి నుంచి క్యారవాన్‌లో రెడీ అయ్యేంత వరకూ.. ఆ తర్వాత షూట్‌లో పాల్గొనే క్లిప్స్‌ను యాడ్ చేసింది. ఈ వీడియోలో సీనియర్ నటి నదియా కూడా కనిపించింది. ఇక, దీన్ని షేర్ చేస్తూ 'గని సెట్స్‌లో ఏడు గంటల పని.. ముప్పై సెకెండ్లలోనే' అంటూ క్యాప్షన్‌ను కూడా పెట్టింది. దీంతో ఈ వీడియోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'గని' మూవీలో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం చాలా కాలం పాటు అమెరికాలో బాక్సింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇక, ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర కూడా హీరోకు పోటీనిచ్చే బాక్సర్‌గా చేస్తున్నాడు. వీళ్లతో పాటు సునీల్ శెట్టి, కన్నడ హీరో ఉపేంద్ర కూడా కీలక పాత్రలను పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. సయీ మంజ్రేకర్ ఈ సినిమాతో పాటు అడవి శేష్ హీరోగా నటిస్తోన్న 'మేజర్'లోనూ హీరోయిన్‌గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











