Devara: దేవరలో భైరా రోల్ ఇదేనా.. ఆ ట్విస్టులకు మైండ్ బ్లాకే!
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో రకాల జోనర్లలో పాన్ ఇండియా సినిమాలు రూపొందుతోన్నాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే ఆరంభం నుంచే అంచనాలను ఏర్పరచుకుని సెన్సేషన్ అవుతున్నాయి. అలాంటి వాటిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. బడా డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తోన్న 'దేవర' మూవీ ఒకటి. ఈ చిత్రం కోస్టల్ ఏరియా బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుండడంతో ఆరంభం నుంచే దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'దేవర' మూవీకి సంబంధించిన షూటింగ్‌ను గత మార్చిలోనే ప్రారంభించారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన మూడు భారీ యాక్షన్ షెడ్యూళ్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. ఈ క్రమంలోనే త్వరలోనే నాలుగో దాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. ఇలా నవంబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ పార్టు మొత్తాన్ని పూర్తి చేయాలని చిత్ర యూనిట్ టార్గెట్‌గా పెట్టుకుని శరవేగంగా పని చేసుకుంటూ వస్తున్నారు. అదే సమయంలో అప్పుడప్పుడూ ఈ మూవీ నుంచి సర్‌ప్రైజ్‌లు కూడా ప్లాన్ చేస్తున్నారు.

'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో రాబోతున్న 'దేవర' మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన పలు షెడ్యూళ్లలో కూడా పాల్గొన్నారు. ఎన్టీఆర్‌తో కలిసి కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు చేశారు. ఇక, బుధవారం సైఫ్ తన పుట్టినరోజును జరుపుకున్నారు. దీన్ని పురస్కరించుకుని 'దేవర' మూవీ యూనిట్ ఈ చిత్రంలోని ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. దీంతో ఇందులో ఆయన చేస్తున్న రోల్‌పై ఓ న్యూస్ లీకైంది.
ఫిలిం నగర్ సమాచారం ప్రకారం.. 'దేవర' మూవీలో సైఫ్ అలీ ఖాన్ ప్రకృతి సంపదను దోచుకునేందుకు వచ్చిన వ్యక్తి పాత్రను చేస్తున్నాడట. మొదట్లో ఈ రోల్ ఎంతో డీసెంట్‌గా కనిపించినా.. తర్వాత తన క్రూరత్వాన్ని బయటపెట్టి భయపెడతాడని అంటున్నారు. మొత్తానికి ఈ పాత్రతో కొన్ని ట్విస్టులు ముడిపడి ఉంటాయనే టాక్ వినిపిస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో రాబోతున్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం ఇస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











